Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ ప్రేమ పొందినందుకు దేవుడికి రుణపడి వుంటాను: కోహ్లీని ప్రశంసిస్తూ అనుష్క ట్వీట్

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (10:32 IST)
తన భర్త, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి అతని భార్య, సినీ నటి అనుష్క ఓ ట్వీట్ చేశారు. "నువ్వు దేవుడి బిడ్డవు. నీ ప్రేమ పొందినందుకు దేవుడికి రుణపడి వుంటాను. దేవుడికి మించిన స్క్రిప్టు రైటర్ లేరు" అని వ్యాఖ్యానించారు. బుధవారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించి సెంచరీ సాధించాడు. ఇది అతనికి 50వ సెంచరీ. ఇది ఒక ప్రపంచ రికార్డు. దీంతో అనుష్క శర్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆమె గ్యాలరీలోంచే విరాట్‌కు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. భర్త ఎదుగుదలను చూస్తూ మురిసిపోయింది. తాజాగా తన మనసులోని మాటను వెల్లడిస్తూ ట్వీట్ చేసింది. 
 
"దేవుడు అత్యద్భుతమైన స్క్రిప్ట్ రైటర్. నీ ప్రేమ నాకు దక్కినందుకు, నీ ఎదుగుదలను చూసే అవకాశం నాకిచ్చినందుకు ఆ భగవంతుడికి ఎప్పటికీ రుణపడి వుంటా. మనసులోనూ, ఆటపై నిజాయితీగా ఉండే నువ్వు భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తావు. నువ్వు నిజంగా దేవుడి బిడ్డవు" అంటూ భావోద్వేగపూరితమైన ట్వీట్ చేయగా, ఆమెను నెటిజన్లు ప్రశంలతో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా తన భర్త విరాట్ కోహ్లీతో పాటు 7 వికెట్లతో కివీస్ రెక్కలు విరిచిన పేసర్ మహ్మద్ షమీ ఫోటోలను ఆమె షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర!

మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ (Video)

పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న బలూచిస్థాన్ - ఇటు భారత్ కూడా..

కుమార్తెతో కలిసి నీట్ ప్రవేశ పరీక్ష రాసిన తల్లి!

ఆఫీస్ ముగించుకుని అందరూ ఇంటికెళ్తే... ఆ ఉద్యోగి మాత్రం మహిళతో ఎంట్రీ ఇస్తాడు : (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

తర్వాతి కథనం
Show comments