మాస్టర్ బ్లాస్టర్ ఇంట మోగనున్న పెళ్లి బాజాలు?

ఠాగూర్
గురువారం, 14 ఆగస్టు 2025 (17:58 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. సచిన్ టెండూల్కర్ ఏకైక కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. ముంబైకు చెందిన సానియా‌ల చందోక్‌తో అర్జున్‌తో నిశ్చితార్థం జరిగినట్టు సోషల్ మీడియాలో ఓ వైరల్ అవుతోంది. ఈ నిశ్చితార్థం కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినట్టు సమాచారం. అయితే దీనిపై ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. 
 
ముంబై మహానగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలే సానియా చందోక్. రవి ఘాయ్ కుటుంబానికి ఆతిథ్య, ఆహార రంగాల్లో పలు వ్యాపారాలు ఉన్నాయి. ఇంటర్ కాంటినెంటల్ హోటల్, ప్రముఖ ఐస్క్రీమ్ బ్రాండ్ బ్రూక్లిన్ క్రీమరీ పాటు పలు వ్యాపారాలు ఉన్నాయి. ఇక సానియా విషయానికి వస్తే ఆమె చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది. 'మిస్టర్ పాస్ పెట్ స్పా  అండ్  స్టోర్ భాగస్వామిగా, డైరెక్టర్‌గా ఉన్నారు.
 
లెఫ్ట్ ఆర్మ్ పేసర్, బ్యాటర్ అయిన అర్జున్ భారత జట్టులోకి వచ్చేందుకు ఎంతో కష్టపడుతున్నాడు. దేశీవాళీ క్రికెట్ గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్.. 17 ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 37 వికెట్లతో పాటు 532 పరుగులు చేశాడు. 24 టీ20ల్లో 27 వికెట్లు తీసి, 119 పరుగులు చేశాడు. ఇక ఐపీఏల్లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓట్ల దొంగతనం కుట్ర : ఇపుడు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నా... త్వరలో బాంబు పేలుస్తా : రాహుల్ గాంధీ

అబ్బా.. ఇక చదవలేం- ఒత్తిడి తట్టుకోలేక ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థుల ఆత్మహత్య

ఆగ్రాలో ఘోరం- ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి వృద్ధ దంపతుల సజీవ దహనం

భారత్‍‌లో ఎయిరిండి విమాన ప్రమాదం.. బోయింగ్‌పై అమెరికాలో దావా

ఇకపై పాఠాలు చెప్పనున్న దినసరి కూలీ - డీఎస్సీలో టీచర్‌గా ఎంపికైన రత్నరాజు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంట్లో గొడవలపై మేం ఏం చెప్పినా నమ్మరు.. తల తోక కట్ చేసి ఇష్టానికి రాసేస్తారు : మంచు లక్ష్మి

Laya: రెండు దశాబ్దాల తర్వాత శ్రీకాంత్, లయ తో నాగేశ్వరరెడ్డి చిత్రం

Puranala story::మిరాయ్ సక్సెస్ తో పురాణాలపై కల్పిక కథలు క్యూ కడుతున్నాయ్ - స్పెషల్ స్టోరీ

సింజిత్.. ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లకు బ్రదర్... మహేశ్

Atharva Murali: అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments