Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ ప్రపంచంలో విషాదం : రోడ్డు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ మృతి

Webdunia
ఆదివారం, 15 మే 2022 (09:11 IST)
క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం సంభవించింది. ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ కన్నుమూశారు. 46 యేళ్ల సైమండ్స్ ఆస్ట్రేలియా తరపున 26 టెస్టులు, 198 వన్డేలు ఆడిన విషయం తెల్సిందే. గత రాత్రి క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలోని టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందాడు. 
 
అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో సైమ్ండ్స్ ఒక్కరే ఉన్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న పోలీసులు డ్రైవింగ్ సీట్లో ఉన్న సైమండ్స్‌‍ను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే, కారు బోల్తా పడటంతో తీవ్ర గాయాలపై తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు గుర్తించారు.
 
దీంతో సైమండ్స్‌ను రక్షించే ప్రయత్నం విఫలమైంది. తొలుత అతడు సైండ్స్ అని అధికారులు గుర్తించలేకపోయారు. మీడియా సంస్థలే తొలుతు గుర్తించాయి. అతడి మృతివార్త తెలిసిన వెంటనే క్రికెట్ ప్రపంచం నివ్వెర పోయింది. ఆస్ట్రేలియా క్రికెటర్లు షాక్‌కు గురయ్యారు. 
 
సైమండ్స్ సహచరులైన జాసన్ గిలెస్పీ, ఆడం గిల్‌క్రిస్ట్, పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తదితరులు ట్వీట్లతో తమ బాధను పంచుకున్నారు. సైమండ్స్ మృతి చెందాడన్న వార్తను నమ్మలేకపోతున్నామని, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
కాగా, గతంలో కూడా ఆస్ట్రేలియా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో వరుసగా పలువురు క్రికెటర్లు దుర్మరణం పాలైన విషయం తెల్సిందే. వీరిలో మాజీ క్రికెటర్ ప్రపంచ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్, మరో మాజీ క్రికెటర్ రాడ్ మార్ష్‌లు ఉండగా, తాజాగా ఆండ్రూ సైమండ్స్ ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

తర్వాతి కథనం
Show comments