Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్!!

వరుణ్
సోమవారం, 17 జూన్ 2024 (16:16 IST)
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఎంపిక దాదాపుగా ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించాల్సివుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ వరకు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. 
 
ఆ వెంటనే అతని స్థానంలో గంభీర్ తన పని మొదలెట్టనున్నాడు. ఈ మేరకు గంభీర్ డిమాండ్‌కు బీసీసీఐ పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. జట్టు సహాయక కోచింగ్ సిబ్బందిని తానే నిర్ణయిస్తానని, అందుకు సమ్మతిస్తేనే కోచ్‌గా వస్తానని గంభీర్ షరతు విధించినట్టు సమచారం. దీనికి బీసీసీఐ సమ్మతించడంతో బీసీసీఐ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. 
 
'భారత జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం గంభీర్‌తో చర్చించాం. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ద్రవిడ్ స్థానాన్ని అతను భర్తీ చేస్తాడు' అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం బ్యాటింగ్‌‍కు విక్రమ్ రాథోడ్, బౌలింగ్‌‍కు పారస్ మాంబ్రే, ఫీల్డింగ్‌కు దిలీప్ సహాయ కోచ్‌లుగా ఉన్నారు. వీళ్ల స్థానాల్లో కొత్తవాళ్లను గంభీర్ తీసుకునే అవకాశముంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అమర్నాథ్ యాత్ర కోసం 3 లక్షల 60 వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్, యుద్ధమేఘాల మధ్య సాధ్యమేనా?

బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయాలు... ఎలా?

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

తర్వాతి కథనం
Show comments