Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌కు ఊరట.. ఎలాగంటే?

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (11:18 IST)
కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో మహిళల పట్ల అభ్యంతర వ్యాఖ్యలు చేసిన హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌కు ఊరట లభించింది. ఆసీస్ పర్యటనలో వున్న వీరిని అర్థాంతరంగా వెనక్కి పిలిపించడమే కాకుండా తర్వాత సిరీస్‌లకు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఇద్దరి తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాకుండా బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పారు. అయినా ఈ వివాదం కొలిక్కి రాలేదు. 
 
తాజాగా ఈ వ్యవహారంలో వీరిద్దరికీ ఊరట లభించింది. హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లపై విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు నియమించిన పాలకమండలి ఎత్తివేసింది. వీరిద్దరిపై నిషేధాన్ని ఎత్తివేయాలని బీసీసీఐ సహా.. పలువురు మాజీ క్రికెటర్లు పాలకమండలిని కోరారు. 
 
ఫలితంగా వీరిద్దరిపై బీసీసీఐ నిషేధం ఎత్తివేసింది. దీంతో తర్వాతి సిరీస్‌లలో హార్దిక్ పాండ్యా, రాహుల్‌లకు ఆడే అవకాశం ఉందని సమాచారం. మరికొన్ని నెలల్లో వరల్డ్ కప్ ఉండడంతో ఈ తీర్పు వాళ్ళ కెరీర్‌లను నిలబెట్టిందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

తర్వాతి కథనం
Show comments