Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఆట తీరుతో ఎంతమంది మెంటల్ హెల్త్ పాడవుతుంది.. పాక్ యువతి (Video)

ఠాగూర్
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (10:32 IST)
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్ జట్టును భారత్ చిత్తుగా ఓడించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు 241 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత స్టార్ హీరో విరాట్ కోహ్లి సెంచరీతో భారత్ గెలుపును సులభంగా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఓడిపోవడాన్ని ఆ దేశ క్రికెట్ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. 
 
ఇదే విషయంపై పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతి తమ ఆటగాళ్ల ఆటతీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి ఇపుడు వైరల్ అయింది. "మా జట్టుకు ఏమైందో అర్థం కావడం లేదు. ఈ మ్యాచ్ వల్ల ఎంతో మంది మెంటల్ హెల్త్ పాడవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లేయర్లు ఆడాలి కదా? బ్యాటింగ్, ఫీల్డింగ్ బాగా చేసేందుకు ప్రాక్టీస్ చేయండి. ఎందుకు మమ్మల్ని పదేపదే నిరుత్సాహపరుస్తున్నారు? అంటూ ఆమె ఘాటుగా ప్రశ్నించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments