Webdunia - Bharat's app for daily news and videos

Install App

డక్ వర్త్ లూయిస్ రూపకర్తల్లో ఒకరైన ఫ్రాంక్ డక్ వర్త్ ఇకలేరు..

వరుణ్
గురువారం, 27 జూన్ 2024 (14:02 IST)
క్రికెట్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించినపుడు మ్యాచ్ ఫలితాన్ని డక్ వర్త్ లూయిస్ విధానంలో నిర్ణయిస్తుంటారు. ఈ పద్దతి ద్వారా లక్ష్యాన్ని, ఓవర్లను కుదించి విజేతను ప్రకటిస్తుంటారు. అయితే, ఈ డక్ వర్త్ లూయిస్ స్టెర్న్ పద్దతి రూపకర్తల్లో ఒకరైన ఫ్రాంక్ డక్ వర్త్ మృతి చెందారు. ఆయన ఈ నెల 21వ తేదీన వృద్దాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
కాగా, 84 ఏళ్ల డక్ వర్త్ మరణవార్త ఆలస్యంగా బయటకు వచ్చింది. క్రిక్ఇన్ఫో వెబ్‌సైట్ మంగళవారం ఆయన మరణవార్తను తెలియజేసింది. ఇంగ్లండ్‌కు చెందిన డక్ వర్త్ గణాంక నిపుణుడు. ఆయన టోనీ లూయిస్‌తో కలిసి డీఎల్ఎస్ పద్ధతిని రూపొందించారు. వర్షంతో ప్రభావితమయ్యే మ్యాచ్‌లలో ఫలితం తేలడానికి కుదించాల్సిన ఓవర్లను, ఛేదించాల్సిన లక్ష్యాలను అంచనా వేసేందుకు వారు డక్ వర్త్ లూయిస్ పేరిట కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
 
డీఎల్ఎస్ పద్ధతిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 1997లో తొలిసారిగా అమలు చేసింది. అనంతరం వర్ష ప్రభావిత మ్యాచ్‌లలో లక్ష్యాల్ని నిర్ణయించడానికి 2001లో ఈ పద్ధతిని ఐసీసీ ప్రామాణికంగా తీసుకుంది. అయితే, ఈ డక్ వర్త్ లూయిస్ పద్ధతికి తదనంతరం ఆస్ట్రేలియాకు చెందిన గణాంక నిపుణుడు స్టీవెన్ స్టెర్న్ కొన్ని మార్పులు చేశారు. దాంతో ఆ తర్వాత ఈ పద్ధతికి డక్ వర్త్-లూయిస్-స్టెర్న్ (డీఎల్ఎస్)గా పేరు మార్చడం జరిగింది. కాగా, లూయిస్ 2020లో కన్నుమూశారు.
 
ఇక ఈ విధానాన్ని కనిపెట్టినందుకు జూన్ 2010లో డక్ వర్త్, లూయిస్లకు ఎంబీఈ (మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్) అవార్డు పొందారు. డక్ వర్త్ 2014 వరకు ఐసీసీలో కన్సల్టెంట్ స్టాటిస్టిషియన్‌గా ఉన్నారు. 'ఫ్రాంక్ ఒక అత్యుత్తమ గణాంకవేత్త. ఆయన తీసుకువచ్చిన డీఎల్ఎస్ పద్ధతి క్రికెట్‌లో అద్భుత ఆవిష్కరణ. మేము దానిని ప్రారంభించిన రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్లో ఉపయోగించడం జరుగుతోంది' అని ఐసీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్స్) వసీం ఖాన్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు బెంబేలెత్తిన పాకిస్థాన్... ఎయిర్‌పోర్టులు మూసివేత!!

ఆపరేషన్ సిందూర్ దాడులు : 80 మంది ఉగ్రవాదుల హతం

మంగళవారం అర్థరాత్రి 1.44 గంటలకు ఆపరేషన్ సిందూర్ స్టార్ట్ (Video)

"ఆపరేషన్ సింధూర్" అంటే ఏమిటి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం
Show comments