Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ మ్యాచ్ : ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ వర్షార్పణం

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (16:34 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, శుక్రవారం రెండు బలమైన జట్లు అయిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షానికి తుడిచిపెట్టుకుని పోయింది. ఒక్క బంతి కూడా పడకుండానే ఈ మ్యాచ్ వర్షార్పణమైంది. అలాగే, ఉదయం ఆప్ఘనిస్థాన్, ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు చేశారు. 
 
ఈ రెండు మ్యాచ్‌లకు మెల్‌బోర్న్ వేదికగా కేటాయించారు. అయితే, ఇక్కడ గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం మెల్‌బోర్న్‌లో వర్షం కురవకపోయినా, మైదానం ఆటకు ఏమాత్రం అనువుగా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన కీలక మ్యాచ్‌ రద్దు అయింది. ఫలితంగా ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. 
 
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో ఇంగ్లండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒకదాంట్లో ఓడిపోగా, ఒకదాంట్లో గెలిచింది. మరో మ్యాచ్ టైగా ముగిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

APSDMA: ఏపీలో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

Bhagavad Gita: కుమార్తె పెళ్లి.. అతిథులకు భగవద్గీత కాపీలు పంపిణీ చేసిన తండ్రి.. ఎక్కడ?

పునాదులు లేకుండానే గోడ నిర్మించిన కాంట్రాక్టర్...

కేదార్నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు.. తొలి రోజే రికార్డు స్థాయిలో...

Boyfriend : ప్రియురాలిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు-ఒంటిపై 20 కత్తిపోట్లు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

తర్వాతి కథనం
Show comments