Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో టెస్ట్‌కు ముందు ఆస్ట్రేలియాకు కంగారు..

ఠాగూర్
శనివారం, 30 నవంబరు 2024 (10:45 IST)
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా, పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఇపుడు రెండో టెస్ట్ మ్యాచ్ అడిలైడ్ వేదికగా జరగాల్సివుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా వెల్లడించింది. అతని స్థానంలో కొత్తగా సీన్ అబాట్, డొగ్గెట్‌కు జట్టులో చోటు కల్పించారు. 
 
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో భాగంగా ఇప్పటికే తొలి టెస్టులో ఓటమితో ఖంగుతిన్న ఆతిథ్య ఆస్ట్రేలియాకు హేజిల్‌వుడ్ జట్టుకు దూరం కావడంతో  గట్టి ఎదురుదెబ్బలాంటిదే. డిసెంబరు 6 నుంచి అడిలైడ్ ఓవల్ వేదికగా ప్రారంభమయ్యే ఈ పింక్బాల్ (డే అండ్ నైట్) టెస్టుకు హేజిల్వుడ్ దూరమైనట్లు శనివారం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది.
 
నడుము కింది భాగంలో గాయం కారణంగా నొప్పి ఉన్నట్టు తెలిపింది. దీంతో అతడిని పరీక్షించిన వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించినట్లు సీఏ పేర్కొంది. అతడు కోలుకునే వరకూ జట్టుతోనే ఉంటాడని, వైద్య బృందం పర్యవేక్షిస్తుందని తెలిపింది. కాగా, భారత్‌తో తొలి టెస్టులో ఈ ఫాస్ట్ బౌలర్ ఐదు వికెట్లతో రాణించిన విషయం తెలిసిందే.
 
మరోవైపు, అటు కాన్‌బెర్రా వేదికగా టీమిండియాతో జరుగుతున్న ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టులో ఉన్న బోలాండ్‌కు కూడా అవకాశం ఉంది. ఈ రెండు రోజుల వార్మప్ మ్యాచ్ (డే అండ్ నైట్)లో అతడు బాగా రాణిస్తే.. భారత్‌తో రెండో టెస్టులో ఆసీస్ తుది జట్టులో అతను ఉండే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijaysai Reddy: తిరుమల దర్శనం.. మొక్కులు- బీజేపీలో చేరనున్న విజయ సాయిరెడ్డి? (video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

తర్వాతి కథనం
Show comments