Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీలాగా తిట్టొద్దు.. రాహుల్‌లాగా బోధించండి.. హార్దిక్ పాండ్యాలు తయారవుతారు

తప్పు జరిగినప్పుడు, అనుకున్నది సాధించలేనప్పుడు, క్యాచ్ మిస్ చేసినప్పుడు, బంతిని ఫోర్ పోకుండా ఆపలేనప్పుడు, జట్టు ఓటమికి గురైనప్పుడు మనం చేయవలసింది కోహ్లీ లాగా మనిషిపై పడి మొరగటం కాదు. రాహుల్ ద్రావిడ్ ‌లాగా తప్పుచేసినవాడిని ప్రేమించాలి. ఆ ప్రేమ ఆ తప్పు

Webdunia
శనివారం, 27 మే 2017 (02:57 IST)
ఏ ఆటలోనైనా, ఏ పనిలోనైనా తప్పు జరిగితే దాన్ని చేసినవాడిపై విరుచుకుపడం క్షణంలో పని.. కానీ అలా విరుచుకుపటడం వల్ల ఆ ఆట లేదా ఆ పని పూర్తవుతుందో లేదో చెప్పలేంకానీ తప్పుచేసిన వాడు జీవితకాలం ఆత్మవిశ్వాసం కోల్పోయి ఎందుకూ పనికిరానివాడిగా మిగిలిపోవచ్చు. అందుకే తప్పు జరిగినప్పుడు, అనుకున్నది సాధించలేనప్పుడు, క్యాచ్ మిస్ చేసినప్పుడు, బంతిని ఫోర్ పోకుండా ఆపలేనప్పుడు, జట్టు ఓటమికి గురైనప్పుడు మనం చేయవలసింది కోహ్లీ లాగా మనిషిపై పడి మొరగటం కాదు. రాహుల్ ద్రావిడ్ ‌లాగా తప్పుచేసినవాడిని ప్రేమించాలి. ఆ ప్రేమ ఆ తప్పు చేసినవాడిని పునీతం చేయాలి. మరోసారి తప్పు చేయకుండా ఇకపై ఏం చేయాలో మెలకువలు బోధించాలి. అలా చెప్పిన ప్రేమపూర్వక పాఠాలే మన కళ్లముందు హార్దిక్ పాండ్యాలు అవుతాయి.
 
గత కొంతకాలంగా భారత క్రికెట్ జట్టులో కీలకంగా మారిపోయిన హర్దిక్ పాండ్యా.. తన ఎదుగుదలకు టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడే కారణమంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. తన క్రికెట్ కెరీర్ అభ్యున్నతిలో ద్రవిడ్ సార్ పాత్ర వెలకట్టలేనిదిగా పాండ్యా తెలిపాడు. టీమిండియా-ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహించినప్పుడు రాహుల్ సార్ నుంచి అనేక విషయాల్ని నేర్చుకున్నట్లు ఈ యువ కెరటం స్పష్టం చేశాడు.
 
'నిజంగా జాతీయ జట్టులోకి పిలుపు వచ్చినప్పుడు నేను చాలా ఉద్వేగానికి లోనయ్యా. భారత జట్టుకు ఏదో చేయాలనే ఉద్దేశంతో దేవుడే నన్ను అక్కడికి పంపించాడని భావించా. అయితే నేను అనుకున్న దానికంటే ముందుగా భారత్ జట్టులో స్థానం సంపాదించడానికి ద్రవిడే సార్ కారణం. ఇక్కడ ఆయనకు థాంక్య్ చెప్పాలి. అతను నన్ను మానసికంగా బలోపేతం చేసి జట్టులో స్థానం సంపాదించడానికి కారణమయ్యాడు. జాతీయ జట్టులో చోటు దక్కే క్రమంలో క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది' 'అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.
 
'గతంలో ఆస్ట్రేలియా-ఎ జట్టుతో లీగ్ గేమ్‌ను పరుగు తేడాతో కోల్పోయాం. మేము 19 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన తరుణంలో గెలుపు అంచుల వరకూ వచ్చి పరాజయం చెందాం. ఆ మ్యాచ్ ను గెలుస్తామనే నేను అనుకున్నా. నేను అనవసరపు పరుగు కోసం యత్నించి రనౌట్ గా పెవిలియన్ చేరడంతో మ్యాచ్ ఆసీస్ వైపు మళ్లింది. అప్పుడు ద్రవిడ్ సార్ నన్ను తిడతారేమోనని భయమేసింది. కానీ ద్రవిడ్ సార్ నాపై ఎటువంటి ఆగ్రహం వ్యక్తం చేయకపోగా, నన్ను పక్కనే కూర్చుపెట్టుకుని కొన్ని మార్గదర్శకాలు సూచించారు. నువ్వు ఇక నుంచి మ్యాచ్‌లు ఫినిషింగ్ చేసే అలవాటు చేసుకో. అలా చేసిన పక్షంలో భారత జాతీయ క్రికెట్ జట్టులో నీకు స్థానం ఖాయం అని చెప్పారు. ఇలా నాలో స్ఫూర్తిని నింపి భారత జట్టులో చోటు దక్కడానికి ద్రవిడ్ సార్ కారణమయ్యారు'అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.
 
మనిషిని కాదు మనిషిలోని తప్పును ప్రేమించండి.. ఆ తప్పునుంచి ఎలా బయటపడాలో నేర్పించండి. అప్పుడు బాహుబలిలు చనిపోరు. పాండ్యాలు.. హార్దిక్ పాండ్యాలు తయారవుతారు.
 
రాహుల్ ద్రావిడ్ అనే భారతీయ క్రికెట్ దిగ్గజం నేర్పుతున్న పాఠం ఇదే మరి.  మనిషిని ప్రేమించండి. ఆతడిలో ఆత్మవిశ్వాసాన్ని కూల్చేయకండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

తర్వాతి కథనం
Show comments