Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ పేస్ బౌలర్ పర్వీందర్ అవానా క్రికెట్‌కు గుడ్‌బై

ఢిల్లీ పేస్ బౌలర్ పర్వీందర్ అవానా తన క్రికెట్ కెరీర్‌కు స్వస్తి పలికాడు. తొమ్మిదేళ్లపాటు ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన 31 ఏళ్ల అవానా-2012లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన ట్వంటీ20 సిరీస్‌లో భారత్‌ తరఫు

Webdunia
బుధవారం, 18 జులై 2018 (19:15 IST)
ఢిల్లీ పేస్ బౌలర్ పర్వీందర్ అవానా తన క్రికెట్ కెరీర్‌కు స్వస్తి పలికాడు. తొమ్మిదేళ్లపాటు ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన 31 ఏళ్ల అవానా-2012లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన ట్వంటీ20 సిరీస్‌లో భారత్‌ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడి ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు.


అవానా 62 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 29.23 సగటుతో 191 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో అన్నీ ఫార్మాట్లకు అవానా గుడ్ బై చెప్పేశాడు. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయమని.. తాను క్రికెట్ నుంచి తప్పుకునేందుకు సమయం ఆసన్నమైందని అవానా చెప్పుకొచ్చాడు. 
 
మరోవైపు మొహమ్మద్ కైఫ్ కూడా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత్‌కు చివరిసారి ప్రాతినిధ్యం వహించిన 12 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. లోయర్ ఆర్డర్‌లో జట్టును అనేకసార్లు ఆదుకున్న కైఫ్, ఫీల్డింగ్ చేసేటప్పుడు చిరుతలా కదిలేవాడు. మహ్మద్ కైఫ్ తన క్రికెట్ కెరీర్‌లో 13 టెస్టులు, 125 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. ఇక టెస్టుల్లో 624 పరుగులు చేశాడు. 
 
టెస్టు ఫార్మాట్‌లో ఒక సెంచరీ, మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. 125 వన్డేల్లో 2753 పరుగులు సాధించగా... అందులో 2 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన రిటైర్మెంట్ లేఖను బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరికి కైఫ్ పంపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments