Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తొలి టీ20 : కివీస్‌ను కోహ్లీ సేన చిత్తు చేసేనా?

భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టు ఆతిథ్య కోహ్లీ సేనతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పూర్తి చేసి... ఇపుడు ట్వంటీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (10:38 IST)
భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టు ఆతిథ్య కోహ్లీ సేనతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పూర్తి చేసి... ఇపుడు ట్వంటీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం రాత్రి గం.7.00 లకు ఇరు జట్ల మధ్య మొదటి టీ20 ఆరంభంకానుంది. 
 
అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించిన విషయం తెల్సిందే. తొలి వన్డేలో ఓటమి పాలైన టీమిండియా.. ఆపై జరిగిన రెండు వన్డేల్లో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. దాంతో వన్డే సిరీస్‌ను గెలిచిన ఉత్సాహంతో విరాట్ సేన బరిలోకి దిగుతుండగా, కనీసం టీ20 సిరీస్‌ను సాధించాలనే పట్టుదలతో కివీస్ పోరుకు సిద్ధమవుతోంది. 
 
అయితే మూడు వన్డేల్లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న టీమిండియాకు టీ20 సిరీస్‌ల్లో కూడా గట్టి పోటీ తప్పకపోవచ్చు. న్యూజిలాండ్ బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఫామ్ లేకపోవడం ఆ జట్టును కలవరపరుస్తోంది. దీంతో టీమిండియాతో జరిగే టీ 20ల్లో బోణి కొట్టాలంటే మాత్రం న్యూజిలాండ్ సమష్టిగా రాణించాల్సి ఉంది. 
 
అయితే, ఈ యేడాది భారత జట్టు ఇప్పటివరకూ స్వదేశంలో ఆడిన టీ20 సిరీస్‌లు రెండు. జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్ ఒకటైతై, ఇటీవల ఆసీస్ జరిగిన మూడు టీ 20ల సిరీస్ మాత్రమే స్వదేశంలో విరాట్ సేన ఆడింది. ఈ రెండు సిరీస్‌ల్లోనూ భారత్ కు ప్రత్యర్థి జట్ల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌ను 2-1 తో గెలిచిన విరాట్ సేన.. ఆసీస్‌తో జరిగిన సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. ఆ క్రమంలో భారత్‌కు న్యూజిలాండ్ సవాల్ విసిరే అవకాశం లేకపోలేదు.
 
ఎందుకంటే పొట్టి ఫార్మాట్‌లో ఎదురులేని కివీస్‌తో పోటీకిసై అంటోంది. తొలి టీ20 మ్యాచ్‌కు ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల స్టేడియం ముస్తాబైంది. వన్డే సిరీస్‌లో అంచనాలకుమించి రాణించింది. అచ్చొచ్చిన ఫార్మాట్‌లో కోహ్లీసేనను దెబ్బకొట్టి, వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. 
 
ఈ మ్యాచ్‌లో నెగ్గి వెటరన్ బౌలర్ నెహ్రాకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు భారత్ సమాయత్తం అవుతోంది. వన్డే సిరీస్ విక్టరీ జోష్‌లో ఉన్న టీమిండియా.. టీ20ల్లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. అచ్చొచ్చిన ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో గెలిచి శుభారంభం చేయాలని చూస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఓపెనర్లు ధావన్, రోహిత్ అద్భుత ఫామ్‌లో ఉండటంతో గెలుపుపై ధీమాతో ఉంది. అయితే మిడిలార్డర్ వైఫల్యం ఇంకా టీమిండియాను వేధిస్తూనే ఉంది. దినేష్ కార్తిక్ పర్వాలేదనిపిస్తున్నా ధోనీ, పాండ్యాలు ఇంకా గాడిన పడలేదు. ఇక బౌలింగ్‌లో బూమ్రా, భువీల జోడి మంచి జోరుమీదుంది. వీరితో పాటు యంగ్ స్పిన్నర్స్ చాహల్, కుల్దీప్ యాదవ్‌లు ఆకట్టుకుంటున్నారు.
 
ఇక టీ20ల్లో నెంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్న కివీస్‌లో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు. ఓపెనర్ మున్రోతో పాటు సీనియర్ ప్లేయర్ గుప్తిల్ కుదురుకుంటే టీమిండియా బౌలర్లకు చుక్కలే.. ఇక మిడిలార్డర్‌లో కెప్టెన్ విలియమ్సన్ ఫామ్‌లోకి రావడంతో కివీస్ బ్యాటింగ్ మరింత బలోపేతమైంది. వెటరన్ రాస్ టేలర్‌తో పాటు టీమ్ లాథమ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. యంగ్ ప్లేయర్స్ నికోల్స్ సైతం ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఆల్ రౌండర్ గ్రాండ్ హోమ్‌తో పాటు స్పిన్నర్ సాట్నర్ బ్యాటింగ్‌లో రాణించే సత్తా గలవారే.. టీ20ల్లో మంచి రికార్డున్న స్టార్ పేసర్ బౌల్ట్, సౌతీలతో కూడిన పేస్ ఎటాక్ కివీస్ అదనపు బలం కానుంది.
 
టీ20ల్లో టీమిండియాకు కివీస్‌పై అత్యంత చెత్త రికార్డుంది. ఇప్పటివరకు టీ20ల్లో కివీస్‌పై టీమిండియా కనీసం ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. ఐదు మ్యాచ్‌లాడితే ఐదింటా కివీసే విజయం సాధించింది. రెండు సిరీస్‌లను ఎగరేసుకుపోయింది. ఇక ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో టీమిండియాకు ఇదే మొదటి టీ20. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఈ పిచ్‌పై పరుగుల వరదపారనుంది. టాస్ నెగ్గిన టీం ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం
Show comments