Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఐపీఎల్ మ్యాచ్.. కెప్టెన్‌గా మళ్లీ ధోనీ?

సెల్వి
శనివారం, 5 ఏప్రియల్ 2025 (14:35 IST)
ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ధోనీ నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. అతడే జట్టును నడిపించాలి. అయితే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్ కుడి చేతి భుజానికి గాయం అయింది. టుషార్ దేశ్‌పాండే వేసిన బంతి అనూహ్యంగా ఎగిరి, అతడి చేతికి బలంగా తాకింది. దీంతో గైక్వాడ్ గాయపడ్డాడు. గాయం నుంచి ఇంకా రుతురాజ్ కోలుకోకపోవడంతో ఆయన కెప్టెన్సీ పగ్గాల నుంచి తప్పుకునే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 
 
ఒకవేళ నిజంగానే గైక్వాడ్ ఆటకు అందుబాటులో లేకపోతే, సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంశంపై ప్రస్తుతానికైతే సరైన స్పష్టత రాలేదు. దీనిపై హసీ మాట్లాడుతూ, మా జట్టులో మంచి యువ ఆటగాళ్లు ఉన్నారు. వికెట్‌కీపర్ అయిన ఒక వ్యక్తి ఈ బాధ్యతను తీసుకోవచ్చేమో. అతనికి ఈ బాధ్యతలు చేపట్టిన అనుభవం కూడా ఉంది. కానీ, కచ్చితంగా చెప్పలేను" అంటూ హస్సీ.. ధోనీ పేరు చెప్పకుండా కెప్టెన్సీ విషయంపై మాట్లాడాడు. 
 
హస్సీ మాటలను బట్టి చూస్తే.. ధోనీ మళ్లీ నాయకత్వం వహించడానికి సిద్ధమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఐదుసార్లు సీఎస్కేకు ఐపీఎల్ టైటిల్స్ అందించిన ధోనీ, ఈ సీజన్‌లో వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా తన సత్తా చాటుతున్నాడు. కాబట్టి శనివారం జరిగే మ్యాచ్‌లో ధోనీ టాస్‌కు వెళ్లే అవకాశం ఉందని అంతా చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments