Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ ప్రేక్షకుల నుంచి మాకు మద్దతు లభించదు.. అయినప్పటికీ : కివీస్ కెప్టెన్ కేన్

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (16:28 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలోభాగంగా, బుధవారం భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ పోరుకు ఇరు జట్లూ అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ సెమీస్ నేపథ్యంలో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ వంటి జట్టుతో అదీ కూడా ఆ దేశంలో మ్యాచ్ అంటే అతిపెద్ద సవాల్‌తో కూడుకున్నది. భారత క్రికెట్ జట్టును అత్యుత్తమ జట్టుగా భావించలేమని, పెద్ద జట్లలో ఒకటి అని వ్యాఖ్యానించారు. 
 
"ముఖ్యంగా, రేపటి మ్యాచ్ వాంఖడే స్టేడియం టీమిండియా అభిమానులతో నిండిపోతుందని మాకు తెలుసు. కానీ, గతంలోనూ ఇలాంటి ప్రేక్షక సమూహాల సమక్షంలో మ్యాచ్‌లు ఆడిన అనుభవం, సందర్భాలు మాకున్నాయి. ఇలాంటి స్టేడియాల్లో ఆడే అవకాశం రావడం ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రేక్షకుల నుంచి మాకు మద్దతు లభించనప్పటికీ మేం రాణించిన సందర్భాలు ఉన్నాయి. టీమిండియాతో వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం" అని కేన్ విలియమ్సన్ చెప్పుకొచ్చారు. 
 
ప్రపంచ కప్‌లో భారత్ వరుస విజయాలకు కారణం అదే : రాహుల్ ద్రావిడ్  
 
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భారత్ వరుసగా తొమ్మిది మ్యాచ్‌లలో విజయం సాధించి, బుధవారం సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ వరుస విజయాలు సాధించడానికి గల కారణాన్ని ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ వెల్లడించాడు. జట్టు తనకు తానుగా ప్రత్యేకంగా ఓ టాస్క్ పెట్టుకుందన్నాడు. విజయాల వైపు జట్టును నడిపించేందుకు ప్రత్యేకంగా జట్టుకు ఓ మిషన్‌ను ఇచ్చినట్టు చెప్పాడు.
 
'ప్రపంచకప్ కోసం మేం కొన్ని సవాళ్లు సిద్ధం చేసుకున్నాం. తొమ్మిది వేర్వేరు నగరాల్లో జరిగిన మ్యాచ్‌లలో అభిమానుల నుంచి విశేషమైన మద్దతు లభించింది. వీలైనంత బాగా ఆడాలని, మంచి ప్రదర్శన కనబర్చాలని అనుకున్నాం. కుర్రాళ్లు కూడా చక్కగా ఆడారు' అని 'స్టార్ స్పోర్ట్స్'తో చెప్పుకొచ్చాడు.
 
సెమీస్‌కు ముందు ఆరు రోజుల విశ్రాంతి లభించిందని, ఇది తమకు బాగా కలిసి వచ్చిందన్నాడు. జట్టులోని ఐదుగురు బ్యాటర్లు అద్భుతంగా ఆడుతున్నారని, ఇద్దరు ముగ్గురు సెంచరీలతో అదరగొడుతున్నారని కితాబిచ్చాడు. బంతితో ప్రయోగాలు కూడా లాభించాయని వివరించాడు. 
 
జట్టులోని మిడిలార్డర్ అద్భుతంగా రాణిస్తోందని ప్రశంసించాడు. టాపార్డర్ కూడా పరుగుల వర్షం కురిపిస్తోందన్నాడు. లీడర్ బోర్డు వంక చూస్తే రోహిత్, కోహ్లీ పరుగుల వాన కనిపిస్తుందని, వారు అద్భుతంగా ఆడుతున్నారని ద్రవిడ్ ప్రశంసించాడు. మిడిలార్డర్‌పై సహజంగానే ఎప్పుడూ కొంత ఒత్తిడి ఉంటుందని వివరించాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

తర్వాతి కథనం
Show comments