Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్విన్, జడేజాలు క్రికెట్ కెరీర్ గురించి మరచిపోవచ్చు: సెహ్వాగ్

భారత స్టార్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తమ క్రికెట్ కెరీర్ గురించి మరచిపోవచ్చని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... అశ్విన్, జడేజాలను క్రికెట

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (10:52 IST)
భారత స్టార్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తమ క్రికెట్ కెరీర్ గురించి మరచిపోవచ్చని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... అశ్విన్, జడేజాలను క్రికెట్ అభిమానులు మరచిపోయేలా కులదీప్ యాదవ్, యజువేంద్ర చాహాల్‌లు అద్భుత రీతిలో తమ ఫామ్‌ను కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. 
 
స్టార్ బౌలర్లు లేని వేళ, జట్టులో ఏర్పడిన శూన్యాన్ని వీరిద్దరూ భర్తీ చేశారని, ఎప్పుడు వికెట్ కావాలని అనిపించినా, తామున్నామని భరోసాను ఇచ్చేలా వీరి ప్రదర్శన సాగుతోందని, ఇది భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. 
 
కోహ్లీ సైతం చాహాల్‌ను పిలిచి మరీ బౌలింగ్‌ను అప్పగిస్తున్నాడని, ఆదివారం జరిగే మ్యాచ్‌లోనే ఇండియా సిరీస్‌ను గెలుచుకుని 3-0 ఆధిక్యంలోకి వెళుతుందని తాను భావిస్తున్నానని అన్నాడు. ఇద్దరు అనుభవజ్ఞులు లేని లోటు తెలియడం లేదన్నారు. 
 
కాగా, కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో గురువారం జరిగిన రెండో వన్డే ఇంటర్నేషనల్ లో ఎన్నో ఏళ్ల తరువాత భారత్ తరఫున హ్యాట్రిక్ తీసిన ఘనతను కులదీప్ యాదవ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

తర్వాతి కథనం
Show comments