Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహ్మద్ షమీకి యాక్సిడెంట్: నా భర్త ఒక్కరినీ వదల్లేదు హసీన్

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ విమర్శలు గుప్పిస్తూనే వున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసేందుకు హసీన్ సిద్ధమవుతున్న వేళ.. తన భర్త షమీ మరో అమ్మాయితో చాటింగ్‌ చేశాడ

Webdunia
ఆదివారం, 25 మార్చి 2018 (11:15 IST)
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ విమర్శలు గుప్పిస్తూనే వున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసేందుకు హసీన్ సిద్ధమవుతున్న వేళ.. తన భర్త షమీ మరో అమ్మాయితో చాటింగ్‌ చేశాడని, ఆధారాలు ఇవిగో అంటూ చాటింగ్‌ స్క్రీన్‌షాట్లను ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. 
 
అంతేగాకుండా తన భర్త ఏ ఒక్కరినీ వదల్లేదంటూ కామెంట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమె చేస్తోన్న ఆరోపణలు నిజమై ఉండొచ్చు కానీ, కోర్టుకెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలి కానీ ఇలా చేయడం ఏంటని విమర్శలు గుప్పించారు. కొందరు నెటిజన్లు మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
 
మరోవైపు టీమిండియా క్రికెటర్ మొహమ్మద్ షమీ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతను ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో షమీకి గాయాలైనాయి. డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అతడిని డెహ్రాడూన్‌లోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తలకు తగిలిన గాయాలకు కుట్లు వేశారు. ప్రస్తుతం షమీ డెహ్రాడూన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments