Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే సిరీస్ వైట్‌వాష్ - భారత్‌పై న్యూజిలాండ్ అలవోక విజయం

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (15:28 IST)
బే ఓవల్‌ మైదానంలో భారత్‌తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు విజయభేరీ మోగించింది. భారత్‌ నిర్ధేశించిన 297 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఆటగాళ్లు మరో 17 బంతులు మిగిలివుండగానే సునాయాసంగా ఛేదించారు. ఓపెనర్లు మార్టిన్‌ గప్టిల్‌ (66, 6 ఫోర్లు, 4 సిక్సర్లు), హెన్రీ నికోల్స్‌ (80, 9 ఫోర్లు), విలియమ్సన్ 22, టేలర్ 12, లాథమ్ 32, నీషమ్ 12, గ్రాండ్‌హోం 58 (ఒక సిక్సర్, ఒక ఫోర్) చొప్పున పరుగులు చేయడంతో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి 47.1 ఓవర్లలోనే 300 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. దీంతో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్ వైట్‌వాష్ చేసి.. ట్వంటీ20 సిరీస్‌లో ఎదురైన వైట్ వాష్ (5-0)కు ప్రతీకారం తీర్చుకుంది. 
 
అంతకుముందు భారత జట్టు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. అయితే, టీమిండియాకు రెండో ఓవర్‌లోనే గట్టిదెబ్బ తగిలింది. ఈ ఓవర్ చివరి బంతికి కివీస్ బౌలర్ జెమిసన్ షాకిచ్చాడు. ఒక్క పరుగు చేసి బ్యాటింగ్ చేస్తున్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియా 8 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. 
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బెన్నెట్ బౌలింగ్‌లో జెమిసన్‌కు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. ఫలితంగా ఎనిమిదో ఓవర్ ముగియకముందే భారత్ అత్యంత కీలకమైన రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 
 
ఆ తర్వాత ఓపెనర్ పృథ్వీ షా మాత్రం మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 40 పరుగులు చేసి రాణించాడు. డీ గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో పృథ్వీ షా రనౌట్ అయ్యాడు. అయితే, శ్రేయాస్ అయ్యర్(62) హాఫ్ సెంచరీతో, లోకేష్ రాహుల్(112) సెంచరీతో రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. 
 
ముఖ్యంగా, మనీష్ పాండే తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, 48 బంతుల్లో 42 పరుగులు చేశాడు. చివర్లో రవీంద్ర జడేజా, నవదీప్ సైనీ చెరో 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో మొత్తం 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో బెన్నెట్ 4 వికెట్లు తీయగా.. జెమిసన్, నీషమ్‌కు చెరో వికెట్ దక్కింది. ఫలితంగా కివీస్ ముంగిట ఉంచిన 297 పరుగుల విజయ లక్ష్యాన్ని కివీస్ ఆటగాళ్లు సునాయాసంగా ఛేదించి, భారత్‌పై ప్రతీకారం తీర్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments