Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే మ్యాచ్‌లపై క్రికెట్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (12:11 IST)
భారత క్రికెటర్, లెజెండ్ సచిన్ టెండూల్కర్ వన్డే మ్యాచ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇపుడు వన్డే మ్యాచ్‌లు బోరు కొట్టేస్తున్నాయంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. తన వన్డే కెరీర్‌లో 50కిపైగా సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ నోట ఇటువంటి మాటలు రావడంతో ప్రతి ఒక్కరూ విస్తుపోతున్నారు.
 
వన్డే మ్యాచ్‌లు కాస్తంత బోర్ కొట్టేస్తున్నాయని వ్యాఖ్యానించారు. వన్డే ఫార్మెట్‍కు మార్పులు చేర్పులు చేయాలని ఆయన సూచించారు. టెస్టుల విషయంలోనూ ఆయన స్పందించారు. ఈ మ్యాచ్‌లు కూడా మరింత ఆకర్షణీయంగా సాగేలా చూడాలని ఆయన కోరారు. మ్యాచ్‌లు ఎన్నిరోజుల పాటు సాగిందన్న అంశానికి ప్రాధాన్యత లేదన్నారు. 
 
మ్యాచ్‌‌లపై ఆకర్షణీయత కొనసాగించేందుకు ఈ ఫార్మెట్‌పై ప్రజల దృష్టి మళ్లేలా కృషి చేయాలని ఆయన సూచించారు. ఇటీవల స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లు మూడున్నర రోజుల్లోనే ముగియడంపై అనేక మంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెదవి విరిచిన విషయంతెల్సిందే. ఈ మ్యాచ్‌ల కోసం తయారు చేసిన పిచ్‌లపై విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments