Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : పాకిస్థాన్ సూపర్ విజయం

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (23:01 IST)
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనర్లు నిల‌క‌డి సూపర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. భారత్ నిర్ధేశించిన 152 పరుగుల విజయలక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోకుండా పది వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. తద్వారా ఐసీసీ ఈవెంట్లలో భారత్‌పై ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదన్న అపవాదును చెరిపేసుకుంది. 
 
పైగా, ఐసీసీ నిర్వహించిన అంతర్జాతీయ ఈవెంట్లలో భారత్‌పై పాకిస్థాన్ గెలుపొందడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పాకిస్థాన్ ఓపెన‌ర్లు రిజర్వాన్ - బాబర్ అజమ్‌లు జట్టుకు విజయాన్ని అందించారు. రిజ్వాన్ 55 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 78 ప‌రుగులు చేయ‌గా, అజామ్ 52 బంతుల్లో రెండు సిక్స్‌లు, 6 ఫోర్ల సాయంతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఫలితంగా మరో 13 బంతులు మిగిలివుండగానే 152 పరుగులు చేసి పది వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. భార‌త బౌల‌ర్ల‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క వికెట్ తీయలేకపోయారు. 
 
అంతకుముందు భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు తిగిన భారత్‌కు ఆది నుంచే కష్టాలు వెంటాడాయి. తొలి ఓవర్ నాలుగో బంతికి స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ (0) తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్బీగా వెనుదిరగ్గా, మూడో ఓవర్ తొలి బంతికి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ బౌల్డయ్యాడు. 8 బంతులు ఆడిన రాహుల్ 3 పరుగులు మాత్రమే చేశాడు. 
 
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా 8 బంతుల్లో ఒక ఫోర్, ఓ సిక్సర్ సాయంతో 11 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ దశలో కెప్టెన్ విరాట్ కోహ్లీ జతకలిసిన రిషబ్ పంత్ 30 బంతులను ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి బౌలర్‌కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికీ భారత్ స్కోరు 12.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు. 
 
ఆ తర్వాత పంత్ తర్వాత రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టు స్కోరును పెంచాడు. దీంతో భారత్ 14 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. అయితే, విరాట్ కోహ్లీ మాత్రం జట్టు భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని బ్యాటింగ్ చేశాడు. 
 
ఫలితంగా మొత్తం 49 బంతుల్లో 1 సిక్సర్లు 5 ఫోర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. అలాగే, రవీంద్ర జడేజా కూడా 13 బంతుల్లో 1 ఫోర్లు సాయంతో 13 పరుగులు చేశాడు. అలాగే, హర్దీక్ పాండ్య 8 బంతుల్లో 11 రన్స్ చేయగా, భువనేశ్వర్ కుమార్‌ 4 బంతుల్లో 5 రన్ప్ చొప్పున పరుగులు చేశారు. షమీ పరుగులేమీ చేయలేదు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో ఆఫ్రిది 3 వికెట్లు, అలీ 2, ఖాన్, రౌఫ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

తర్వాతి కథనం
Show comments