Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్పరాజ్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధం.. అంతా ఇంజమామ్ దయ?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (14:29 IST)
పాకిస్థాన్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ చేసిన జాతి వ్యతిరేక వ్యాఖ్యలపై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) సీరియస్ అయ్యింది. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఫెహ్లువాకియా రంగును గురించి సర్పరాజ్ చేసిన వ్యాఖ్యలకు గాను.. శిక్షగా అతనిపై నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని విధిస్తూ ఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. నిజానికి సర్పరాజ్‌పై ఎనిమిది మ్యాచ్‌ల వరకు నిషేధం విధించాలని ఐసీసీ పెద్దలు నిర్ణయించారట. 
 
అయితే పాక్ మాజీ కెప్టెన్, చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ కృషి వల్ల అతని శిక్ష తీవ్రత తగ్గిందట. జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన తర్వాత సర్ఫరాజ్ మీడియా సమావేశంతో పాటు ట్వీట్టర్ సాక్షిగా క్షమాపణలు చెప్పాడు. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్ చేస్తోన్న ప్రోటీజ్ ఆల్‌రౌండర్ ఆండిల్ పెహ్లువాకియా నలుపు రంగును ఉద్దేశిస్తూ కీపర్‌గా ఉన్న సర్ఫరాజ్ జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. 
 
నల్లని రంగును ఉద్దేశించి కామెంట్లు చేయడం.. ఫెలుక్ అమ్మ గురించి కూడా కామెంట్లు చేయడం స్టంప్స్ మైకులో రికార్డు అయ్యాయి. దీంతో సర్పరాజుకు నాలుగు మ్యాచ్‌ల నిషేధం తప్పలేదు. అయితే సర్పరాజ్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని ఐసీసీ విధించడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిరాశ వ్యక్తం చేసింది. పాక్ ఆటగాళ్లపై ఐసీసీ చిన్నచూపు చూస్తుందని పీసీబీ అధికారులు ఫైర్ అవుతున్నారు. సర్పరాజ్‌పై సస్పెన్షన్ వేటు వేయడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

తర్వాతి కథనం
Show comments