Webdunia - Bharat's app for daily news and videos

Install App

140Kmph వేగంతో బంతి.. రిషబ్ పంత్‌కు గాయం.. బౌలింగ్ ఎవరిది? (video)

సెల్వి
శుక్రవారం, 3 జనవరి 2025 (11:58 IST)
Rishabh Pant
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో టీమ్ ఇండియా బ్యాటింగ్ చేస్తోంది. ఎప్పటిలానే ఆస్ట్రేలియా బౌలర్లు తమ ప్రతాపం చూపిస్తున్నారు. క్రీజ్‌లో రిషబ్ పంత్ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 140 కెఎంపీహెచ్ వేగంతో వచ్చిన బంతి అతని చేతికి పెద్ద గాయం చేసింది. దాంతో పాటూ తలను కూడా తాకింది. ఈ బంతిని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేశాడు. మిచెల్ బంతి వేగానికి పంత్ చెయ్యికి గట్టి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిన చోట నల్లగా కమిలిపోయింది. 
 
దీని వలన పంత్ కాసేపు బ్యాటింగ్ చేయలేకపోయాడు. వెంటనే వైద్య సహాయం అందించాల్సి వచ్చింది. భారత జట్టు ఫిజియో వచ్చి పంత్‌‌కు కాసేపు ఐస్ ప్యాక్ ఇవ్వడంతో పాటూ గాయానికి చికిత్స చేశారు. అయితే అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత ఓవర్లో మరో బంతిని అంతే వేగంతో విసిరాడు స్టార్క్. ఈసారి అది పంత్ తలను తాకింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
కాగా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జరుగుతోంది.ప్రస్తుతం సిడ్నీలో చివరి టెస్టు అవుతోంది. ఈ టెస్ట్‌లో కెప్టెన్ రోహిత్ ఆడటం లేదు. ఇక టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహాగానాలు ఊపందుకున్నాయి. మెల్‌బోర్న్ టెస్ట్ రోహిత్ కు చివరి టెస్ట్ అని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

మావోయిస్టులు ఆయుధాలు వదులుకోకపోతే చర్చలు జరపబోం.. బండి సంజయ్

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

RK Roja: ఆర్కే రోజాపై భూ ఆక్రమణ ఫిర్యాదులు.. టీడీపీని ఆశ్రయించిన బాధితులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

తర్వాతి కథనం
Show comments