ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. రోహిత్ శర్మ ఏమన్నారు?

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2023 (11:33 IST)
ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను ఆ జట్టు మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది. ఈ నిర్ణయం ప్రతి ఒక్క ఐపీఎల్ క్రికెట్ అభిమానిని తీవ్ర నిరుత్సాహానికి లోను చేసింది. ముఖ్యంగా, ఐపీఎల్‌ సీజన్‌లలో ముంబై ఇండియన్స్ జట్టును ఏకంగా ఐదు సార్లు నిలిపిన రోహిత్ శర్మను తొలగించడంపై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. పలువురు మాజీ క్రికెటర్లు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. రోహిత్ శర్మ సతీమణి కూడా స్పందించారు. అలాగే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం కూడా స్పందించింది. 
 
'2013 - 2023 : ఉత్సాహభరితమైన సవాలుకు ఒక ఏడాది! చాలా గౌరవప్రదం రోహిత్!' అంటూ రోహిత్‌కు సానుభూతిగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు పెట్టింది. ఈ పోస్టుపై పసుపు రంగు హార్ట్ ఎమోజీతో రితికా స్పందించింది. కాగా పసుపు రంగు చెన్నై సూపర్ కింగ్స్‌ ఎంతో ప్రత్యేకమైనది. ఆ జట్టు జెర్సీ కూడా అదే రంగులో ఉంటుంది. చెన్నై సొంత మైదానం మొత్తం ఆ పసుపుమయంగా కనిపిస్తుందన్న విషయం తెలిసిందే.
 
కాగా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు ఏకంగా 11 సీజన్లలో నాయకత్వం వహించాడు. అతడి సారథ్యం జట్టు అత్యంత బలమైన జట్టుగా ఎదిగింది. ఏకంగా 5 సార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు. అయితే హార్దిక్ పాండ్యా గత నెలలో ఫ్రాంచైజీకి తిరిగి వచ్చాక ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా జట్టు ప్రకటించింది. భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా కెప్టెన్‌ మార్చామని ముంబై ఇండియన్స్ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్రాంచైజీకి ఆదర్శప్రాయమైన సేవలు అందించిన రోహిత్‌కు ధన్యవాదాలు అంటూ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

Karnataka: 13 ఏళ్ల బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

తర్వాతి కథనం
Show comments