Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీరేంద్ర సెహ్వాగ్‌-సచిన్ అదుర్స్.. ఫోర్లు, సిక్సర్లతో చితక్కొట్టారు.. భారత్ జయభేరి

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (15:06 IST)
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భారత జట్టు బోణీ కొట్టింది. భారత మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్‌ (35 బంతుల్లో 80 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), సచిన్‌ టెండూల్కర్‌ (33 నాటౌట్‌; 5 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు. ఈ లీగ్‌లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌తో జరిగిన టీ20 పోరులో భారత్‌ 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట బంగ్లా 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. 
 
భారత బౌలర్లలో యువరాజ్‌, ప్రజ్ఞాన్‌ ఓజా, వినయ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో మాజీ ఓపెనర్లు రెచ్చిపోవడంతో భారత్‌ లెజెండ్స్‌ జట్టు 61 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. వీరేంద్రుడు సహజసిద్ధ దూకుడుతో చెలరేగి 10 ఫోర్లు, 5 సిక్సర్లు బాదగా.. సచిన్‌ తన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో అలరించాడు.
 
బోక్సామ్‌ ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ టోర్నీలో సిమ్రన్‌జీత్‌కౌర్‌(60కి) ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో కిరియా తాపియాను సిమ్రన్‌జిత్‌ చిత్తుచేసింది. మరోవైపు జాస్మిన్‌(57కి), పూజ రాణి(75కి) ప్రత్యర్థుల విజయాలతో తుది పోరులో నిలిచారు. 
 
చాలారోజుల తర్వాత బౌట్‌లోకి దిగిన స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ క్వార్టర్స్‌లో వర్జినియా చేతిలో ఓడి కాంస్య పతకంతో సంతృప్తిపడింది. పురుషుల విభాగంలో మొత్తం ఆరుగురు భారత బాక్సర్లు సెమీస్‌లో తలపడేందుకు సిద్ధంగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

కారు ప్రమాదానికి గురైన అజిత్- కారు రేసును ఫ్యామిలీ కోసం వదులుకోరా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

తర్వాతి కథనం
Show comments