Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యర్‌కు గాయం.. టీమిండియాకు, ఢిల్లీ కేపిటల్స్‌కు షాకే

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (15:12 IST)
Shreyas Iyer
ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేలో విజయం సాధించి జోష్‌లో ఉన్న టీమిండియాకు షాక్‌ తగిలింది. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ సమయంలో శ్రెయాస్‌ అయ్యర్‌ ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే. బంతిని ఆపే క్రమంలో శ్రేయస్‌ అయ్యర్‌ భుజానికి బలంగా దెబ్బ తగిలింది. వెంటనే మైదానం వీడిన అతడిని స్కానింగ్‌ కోసం పంపించారు. గాయం తీవ్రత దృష్ట్యా అయ్యర్‌ తదుపరి మ్యాచ్‌ల్లో అతను బరిలోకి దిగే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు తెలిసింది.
 
అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి కూడా అయ్యర్ దూరం కావడం గట్టి ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన ఫస్ట్ వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా కిందపడ్డ అయ్యర్ ఎడమ భుజం డిస్‌లోకేట్ అయ్యింది. 
 
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో కొట్టిన షాట్‌ను అడ్డుకునే క్రమంలో డైవ్ చేసిన అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ గాయం తీవ్రమైతే ఐపీఎల్‌లో కూడా ఆడటం కష్టం కావొచ్చు. 
 
ఇదే మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తుండగా అతని కుడి మోచేతికి బంతి బలంగా తాకింది. నొప్పి ఎక్కువగా ఉండటంతో రోహిత్ ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

తర్వాతి కథనం
Show comments