Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టన్నింగ్‌ క్యాచ్‌తో స్మృతి : ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో భారత్ విజయం

Webdunia
ఆదివారం, 4 జులై 2021 (14:42 IST)
భారత మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ జట్టు ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో ఓ అద్భుత క్యాచ్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించగా… స్మృతి పట్టుకున్న క్యాచ్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. 
 
మొత్తం 49 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న నాట్‌ స్కివర్‌ దీప్తి బౌలింగ్‌లో లాంగ్‌ షాట్‌ కోసం ప్రయత్నించింది. ఆ సమయంలో బౌండరీ లైన్‌ వద్ద ఉన్న స్మృతి వేగంగా పరిగెడుతూ వచ్చి గాల్లో డైవ్‌ చేసి మరీ క్యాచ్‌ను ఒడిసి పట్టుకుంది. ప్రస్తుతం స్మృతి క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
 
ఈ క్యాచ్ వీడియో క్లిప్పింగ్‌నుచూసిన పలువురు క్రికెట్ దిగ్గజాలు ఆమెపై ప్రశసంలు కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లీసా స్తాలేకర్‌.. ‘ఫ్లై స్మృతి ఫ్లై గ‌ర్ల్.. ఫెంటాస్టిక్ క్యాచ్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇక అభిమానులు సైతం స్మృతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతమైన క్యాచ్‌, ఫెంటాస్టిక్‌ అంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. 
 
ఇక కేవలం ఫీల్డింగ్‌కే పరిమితం కాకుండా స్మృతి ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లోనూ రాణించారు. 57 బంతుల్లో 49 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్‌ జట్టు మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

వాట్సాప్ వైద్యం వికటించింది.. గర్భశోకాన్ని మిగిల్చింది...

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

తర్వాతి కథనం
Show comments