గౌహతి టెస్ట్ మ్యాచ్ : రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 489 రన్స్‌కు సౌతాఫ్రికా ఆలౌట్

ఠాగూర్
ఆదివారం, 23 నవంబరు 2025 (16:49 IST)
గౌహతి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు తమ తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులకు ఆలౌట్ అయ్యారు. సఫారీ ఆటగాళ్లలో ముత్తుసామి సెంచరీ చేసాడు. తొలి రోజు స్కోరు 247/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు భారీ స్కోరు సాధించింది. ఓవర్‌నైట్ 25 పరుగులతో ఆటను కొనసాగించిన ముత్తుసామి (109; 206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతనికిది తొలి శతకం కావడం విశేషం. 
 
తొమ్మిదో స్థానంలో వచ్చిన మార్కో యాన్సెన్ (93; 91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసిన యాన్సెన్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. కైల్ వెరినె (45; 122 బంతుల్లో) రాణించాడు. తొలి రోజు ట్రిస్టన్ స్టబ్స్ (49), తెంబా బావుమా (41), మార్‌క్రమ్ (38), రికెల్‌టన్ (35) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4, రవీంద్ర జడేజా, సిరాజ్, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments