Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిడ్నీ వన్డే : ఆసీస్ ఆటగాళ్ల వీరకుమ్ముడు.. భారత బౌలర్ల బేజారు

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (12:40 IST)
సిడ్నీ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు వీరవిహారం చేస్తున్నారు. ఫలితంగా ఆసీస్ జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే 45 ఓవర్లలు ముగియగా 3 వికెట్లు నష్టానికి 327 పరుగుల భారీ స్కోరు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫలితంగా వార్నర్, ఫించ్‌లు ఓపెనర్లుగా దిగి.. తొలి వికెట్‌కు 142 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో వార్నర్ 83 పరుగుల వద్ద, ఫించ్ 60 రన్స్ వద్ద ఔట్ అయ్యారు. వీరిలో ఫించ్ 69 బంతుల్లో 60 పరుగులు చేసి, ఒక సిక్సు, ఆరు ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసిన ఔటయ్యాడు. అనంతరం కొద్ది సేపటికే డేవిడ్ వార్నర్ ఔటయ్యాడు. అతడు 77 బంతుల్లో 3 సిక్సులు, 7 ఫోర్లతో 83 పరుగులు చేశాడు.
 
ఆ తర్వాత మూడో ఆర్డరులో వచ్చిన స్మిత్ మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. దూకుడుగా ఆడుతూ 2 సిక్సులు, 14 ఫోర్లతో సెంచరీ బాదాడు. 104 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో లాబుస్చాగ్నే 51, మ్యాక్స్ వెల్ 10 పరుగులతో ఉన్నారు. ఆస్ట్రేలియా జట్టు స్కోరు 45.4 ఓవర్లలో 337/3గా ఉంది. భారత బౌలర్లలో షమీ, పాండ్యాలకు ఒక్కో వికెటు దక్కాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments