Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్.. ఏంటో తెలుసా?

టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ టీమిండియాకు శుభవార్త చెప్పింది. ఇకపై దేశీయంగా జరిగే సిరీస్‌లకు కూడా విమానాల్లో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించవచ్చంటూ తీపి కబురు అందించింది. దీంతో భారత జట్టు సభ్యులు ఎగిరి

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2017 (08:52 IST)
టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ టీమిండియాకు శుభవార్త చెప్పింది. ఇకపై దేశీయంగా జరిగే సిరీస్‌లకు కూడా విమానాల్లో బిజినెస్ క్లాస్‌లో  ప్రయాణించవచ్చంటూ తీపి కబురు అందించింది. దీంతో భారత జట్టు సభ్యులు ఎగిరి గంతేస్తున్నారు. స్వదేశీ సిరీస్‌లలో ఒక్క కెప్టెన్, కోచ్‌లకు మాత్రమే ఇప్పటి వరకు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించే వెసులుబాటు ఉంది. ఇప్పుడు దీనిని అందరికీ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  
 
ఎకానమీ క్లాస్‌లో ప్రయాణాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తోటి ప్రయాణికులు సెల్ఫీల కోసం ఎగబడుతున్నారని.. అంతేగాకుండా కాళ్లు పెట్టుకునేందుకు చోటు కూడా ఉండట్లేదని జట్టు సభ్యులు పలుమార్లు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన బీసీసీఐ ఈ విషయాన్ని సీఓఏ కమిటీలో ప్రస్తావించి బిజినెస్ క్లాస్ ప్రస్తావన తీసుకొచ్చింది. ఇందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
ఇదిలా ఉంటే.. భారత్-శ్రీలంక మధ్య ఈనెల 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్ట్ జరగనుంది. ఇందుకోసం భారత జట్టులోని క్రికెటర్లు నగరానికి చేరుకున్నారు. కోచ్ రవిశాస్త్రి, ఆటగాళ్లు ఉమేశ్ యాదవ్, శిఖర్ ధవన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, రహానే తదితరులు కోల్‌కతా చేరుకోగా కెప్టెన్ కోహ్లీ సహా మిగతా ఆటగాళ్లు నేడు రానున్నారు. హార్థిక్ పాండ్యాకు విశ్రాంతి పేరుతో ఈ సిరీస్ నుంచి పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments