Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ వల్లే యువరాజ్ సింగ్ కెరీర్ ముగిసింది : రాబిన్ ఊతప్ప

ఠాగూర్
శుక్రవారం, 10 జనవరి 2025 (20:01 IST)
uthappa
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వల్లే మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కెరీర్ కాస్త ముందుగా అర్థాంతరంగా ముగిసిపోయిందని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆరోపించారు. టీ20 వరల్డ్ కప్-2007 గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రాబిన్ ఉతప్ప ఈ తరహా సంచలన వ్యాఖ్యలు చేయడం ఇపుడు సంచలనంగా మారింది. 
 
ఇదే అంశంపై రాబిన్ ఊతప్ప స్పందిస్తూ, యువరాజ్ సింగ్ కేన్సర్ నుంచి కోలుకున్న తర్వాత జట్టులోకి పునరాగమనం చేశాడని, అయితే ఫిట్నెస్ విషయంలో కాస్త మినహాయింపులు ఇవ్వాలని కోరినప్పటికీ నాడు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ అంగీకరించలేదన్నాడు. 
 
'యువరాజ్ సింగ్ కేన్సర్‌ను ఓడించాడు. మన దేశం రెండు వరల్డ్ కప్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జట్టు కెప్టెన్‌గా ఉన్న వ్యక్తి సహకరించాలి. కేన్సర్ కారణంగా అతడి ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోయిందని మీకు తెలుసు. అతడి ఇబ్బందులను మీరు స్వయంగా చూశారు. 
 
కెప్టెన్‌గా ఉన్నప్పుడు కొన్ని ప్రమాణాలను పాటించాలనేది నిజమే. కానీ నిబంధనల విషయంలో ఎల్లప్పుడూ కొన్ని మినహాయింపులు ఉంటాయి. ముఖ్యంగా యువరాజ్ సింగ్ మినహాయింపులకు అర్హుడు. అతడు కేవలం క్రికెట్ వరల్డ్ కప్‌నే కాదు, కేన్సర్‌ను కూడా జయించాడు. ఈ విషయాలు నాతో ఎవరూ చెప్పలేదు. నేనే గమనించాను' అని ఉతప్ప పేర్కొన్నాడు.
 
కాగా, పరిమిత ఓవర్ల క్రికెట్లో భారతదేశ అత్యుత్తమ ఆటగాళ్లలో యువరాజ్ సింగ్ ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ దిగ్గజం ఎస్ఎం ధోనీ నాయకత్వంలోని 2011లో భారత జట్టు వన్డే వరల్డ్ కప్ గెలవడంతో యూవీ కీలక పాత్ర పోషించాడు. ఇక 2007 టీ20 వరల్డ్ కప్ సాధించడంలో కూడా ముఖ్యపాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో చెలరేగి ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది పెనుసంచలనం నమోదు చేసిన విషయం తెలిసిందే.
 
అయితే, ఆ తర్వాత అనూహ్యంగా కేన్సర్ బారినపడ్డాడు. కేన్సర్‌ను జయించి భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. రీఎంట్రీలో ఇంగ్లండ్‌పై వన్డేలో సెంచరీ కూడా బాదాడు. అయితే, 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో, సెలక్టర్లు యూవీని విస్మరించారు. ఫలితంగా 2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ.. ప్రజలు చికెన్ తినొద్దు..

ఫిబ్రవరి 28న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఏపీ సర్కార్

అక్కా అంటూ ఇంట్లోకి వచ్చాడు.. కూతురుపై కన్నేసి కాటేశాడు...

Traffic: మహా కుంభ మేళాలో ట్రాఫిక్ రికార్డ్.. గంగమ్మలో కోట్లాది మంది మునక.. కాలుష్యం మాట?

ఉచితంగా మటన్ ఇవ్వలేదనీ.. పాతిపెట్టిన మృతదేహాన్ని తీసుకొచ్చాడు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)

ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

ప్ర‌తి ఒక్క‌రూ హెల్త్ కేర్ తీసుకోవాలి : ఐశ్వర్య రాజేష్

తర్వాతి కథనం
Show comments