Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీని ఏకిపారేసిన సెహ్వాగ్... కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగడం అనుమానమే

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ట్విట్టర్లో యాక్టివ్‌గా వుంటూ మస్తుగా ఫాలోవర్స్‌ను సంపాదించిపెట్టుకున్న భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విరాట్ కో

Webdunia
బుధవారం, 24 జనవరి 2018 (11:29 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ట్విట్టర్లో యాక్టివ్‌గా వుంటూ మస్తుగా ఫాలోవర్స్‌ను సంపాదించిపెట్టుకున్న భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విరాట్ కోహ్లీని ఏకిపారేశాడు. మైదానంలో కోహ్లీ ఎన్నో తప్పులు చేస్తున్నాడని.. మైదానంలో కానీ, డ్రెస్సింగ్ రూమ్‌లో కానీ కోహ్లీ చేస్తున్న పొరపాట్ల గురించి వేలెత్తి చూపే ఒక్క ఆటగాడు కూడా లేడని తెలిపాడు. 
 
కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మెనే కానీ.. ఇతర ఆటగాళ్ల నుంచి కూడా అదే స్థాయి ఆటతీరును ఆశిస్తున్నాడని.. అందుకే అంచనాలను అందుకోలేకపోయాడని చెప్పాడు. ఇదే పరిస్థితి కొనసాగితే కోహ్లీ కెప్టెన్సీగా కొనసాగడం అనుమానమేనని చెప్పుకొచ్చాడు. 
 
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా కెప్టెన్‌గా ఉన్నప్పుడు అతనిలా ఎక్కువ పరుగులు చేయాలని అడిగేవాడని..  తనలా వేగంగా ఎందుకు రన్స్ చేయడం లేదని ప్రశ్నించేవాడని కోహ్లీ గుర్తు చేశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్‌ల సలహాలు తీసుకుంటున్న కోహ్లీ, మైదానంలో వాటిని అమలు పరచడం లేదని అన్నాడు. ఒక్కరి కష్టంతో విజయం కుదరదని.. జట్టు సభ్యులంతా సమిష్టిగా కృషి చేయాలని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

తర్వాతి కథనం
Show comments