Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ ఒక్క భారతీయ క్రికెటర్ సాధించని ఘనత అభిషేక్ శర్మ

ఠాగూర్
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025 (11:55 IST)
భారతీయ క్రికెటర్లలో ఏ ఒక్కరికీ సాధ్యంకాని అరుదైన ఫీట్‌ను యువ క్రికెటర్ అభిషేక్ శర్మ సాధించారు. పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఏకంగా 13 సిక్సర్లు బాది తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ ఒక్క భారతీయ క్రికెటర్ సాధించని అరుదైన ఫీట్‌ను అభిషేక్ శర్మ సాధించారు. 
 
అంతకాకుండా, ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కలిపి అభిషేక్ 279 రన్స్ చేశాడు. తద్వారా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆల్‌టైన్ రికార్డును బద్దలు కొట్టాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్ సిరీస్‌లో కోహ్లి 231 పరుగులు చేశాడు.
 
ఓవరాల్‌గా తిలక్ వర్మ ఒక టీ20 సిరీస్ (ఏ జట్టుపైనైనా)లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. గతేడాది దక్షిణాఫ్రికాపై కేవలం 4 ఇన్నింగ్స్‌ల్లోనే అతను 280 పరుగులు చేశాడు. ఇందులో వరుసగా రెండు సెంచరీలు నమోదు కావడం విశేషం.
 
టీమిండియా తరపున ఒక టీ20 సిరీ‌స్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు 
 
280 - తిలక్ వర్మ (4 ఇన్నింగ్స్) వర్సెస్ దక్షిణాఫ్రికా, 2024 
279 - అభిషేక్ శర్మ (5 ఇన్నింగ్స్) వర్సెస్ ఇంగ్లాండ్, 2025 
231 - విరాట్ కోహ్లి (5 ఇన్నింగ్స్) వర్సెస్ ఇంగ్లాండ్, 2021 
224 - కెఎల్ రాహుల్ (5 ఇన్నింగ్స్) వర్సెస్ న్యూజిలాండ్, 2020 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

Kanpur: యువజంట నూడుల్స్ తింటుంటే దాడి చేశారు.. వీడియో వైరల్

నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

తర్వాతి కథనం
Show comments