Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీని వెంటాడుతున్న పాక్ యువ క్రికెటర్... రికార్డులన్నీ మాయం...

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (12:27 IST)
క్రికెట్ పరుగుల యంత్రంగా పేరుగాంచిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని పాకిస్థాన్ యువ క్రికెటర్ బాబర్ అజం వెంటాడుతున్నాడు. దీంతో కోహ్లీ వణికిపోతున్నాడు. తాను నెలకొల్పిన రికార్డులన్ని బాబర్ అజం చెరిపేస్తూ తన వెంటే పరుగెడుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కోహ్లీ ఉన్నాడు. ఇప్పటివరకు వీరిద్దరి ఆటతీరు, చేస్తున్న పరుగులు చూస్తే ఇది నిజమనక తప్పదు. 
 
ఎందుకంటే.. తొలి వెయ్యి పరుగులు చేసేందుకు కోహ్లీ 24 ఇన్నింగ్స్‌లు ఆడితే బాబర్ అజంకు కేవలం 21 ఇన్నింగ్స్‌లు మాత్రమే సరిపోయాయి. అలాగే, రెండు వేల పరుగులను కోహ్లీ 53 ఇన్నింగ్స్‌లలో పూర్తి చేస్తే బాబర్ అజం మాత్రం 45 ఇన్నింగ్స్‌లలో మ్యాచ్‌లలో పూర్తి చేశాడు. అలాగే, మూడు వేల పరుగులను కోహ్లీ 75 ఇన్నింగ్స్‌లలో పూర్తి చేస్తే అజం మాత్రం 68 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. 
 
అయితే, విరాట్ కోహ్లీ, అజంల కంటే సౌతాఫ్రికా ఓపెనర్ హర్షిం ఆమ్లా మాత్రం కేవలం 57 ఇన్నింగ్స్‌లలో మూడు వేల పరుగులు పూర్తి చేశాడు. అదేసమయంలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివిన్ రిచర్డ్స్ 69 ఇన్నింగ్స్‌లలో, ఇదే దేశానికి మరో క్రికెట్ లెజెండ్ సీజీ గ్రీనిడ్జ్ 72 ఇన్నింగ్స్‌లలో, సౌతాఫ్రికా ఆటగాడు గ్యారీ కీర్‌స్టన్ 72 ఇన్నింగ్స్‌లలో మూడు వేల పరుగులు చేసిన రికార్డు సృష్టించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పన్న చందనోత్సవ వేడుక విషాదం .. గాలివానకు గోడ కూలింది.. 8 మంది మృతి!!

భార్యను, కొడుకును తుపాకీతో కాల్చి చంపి టెక్కీ ఆత్మహత్య... ఎక్కడ?

Sailajanath: వైకాపా సింగనమల అసెంబ్లీ సమన్వయకర్తగా సాకే శైలజానాథ్

అప్పన్న స్వామి ఆలయంలో అపశ్రుతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి (video)

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments