Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుందని భార్యను చంపేసిన భర్త

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (15:20 IST)
కట్టుకున్న భార్య సోషల్ మీడియాలో రీల్స్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన భర్త ఆమెను గొంతు నులిపి హత్య చేశాడు. ఈ దారుణం బిహార్ రాష్ట్రంలోని భోజ్‌పుర్‌‍లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, భోజ్‌పుర్‌, ఆరా సమీపంలోని నవాడా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన అన్నూ ఖాతూన్, అనిల్ అనే వ్యక్తికి పదేళ్ల క్రితం వివాహమైంది. కొద్ది సంవత్సరాల క్రితం వేరే కాపురం ఉంటూ వచ్చిన వీర ప్రస్తుతం తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. 
 
అయితే, అన్నూకు సోషల్ మీడియా పిచ్చి. దీంతో సోషల్ మీడియా కోసం అన్నూ రీల్స్ చేస్తుండేది. ఇది అనిల్‌కు నచ్చలేదు. దీంతో దంపతుల మధ్య ఇదే విషయంపై తరచూ గొడవలు జరగుతూ వచ్చాయి. పైగా, మొబైల్‌లో ఉన్న సోషల్ మీడియా యాప్స్ డిలీట్ చేయాలని భార్యపై భర్త ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 
 
ఈ క్రమంలో పట్టరాని కోపంతో భార్య గొంతు నులిమి హత్య చేసిన అనిల్.. రాత్రంతా భార్య శవం పక్కనే ఉండిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అనిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా "నా భార్య వీడియోలను స్నేహితులు, సన్నిహితులు చూసి హేళన చేస్తున్నారు. దీంతో వీడియోలు చేయడం ఆపేయమని పలుమార్లు కోరగా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను గొంతు నులిమి నేనే చంపేశా" అని వివరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments