Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కోర్కె తీర్చు, నీకు కావాల్సినంత ఇస్తా - ఏలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో...

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (21:51 IST)
ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు వారు. పదిమందికి మంచి చెప్పాల్సిన వారే చెడు మార్గం వైపు అడుగులు వేశారు. ఒక మహిళ ఉద్యోగినిని లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. ఉన్నతాధికారులు మందలించినా వినిపించుకోలేదు. సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని వేదికగా చేసుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 

 
ఏలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వ్యవహారం బయటపడింది. సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఆడిట్ సెక్షన్లో అటెండర్‌గా పనిచేస్తున్న వివాహిత దిశా పోలీసులను ఆశ్రయించింది. తనతో పాటు పనిచేసే ఉద్యోగి లైంగికంగా వేధిస్తున్నాడని.. కోర్కె తీర్చాలంటూ వెంటపడుతున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. తమతో పాటు పనిచేసే ఉద్యోగి మారుతాడని ఉన్నతాధికారులు భావించారు.

 
అయితే అతనిలో మార్పు రాలేదు. సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని వేదికగా చేసుకుని ఆమెను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. వారం రోజుల నుంచి వివాహితను ఇబ్బందులకు గురి చేశాడు. ఇక కామంధుడి వేధింపులు భరించలేని ఆ వివాహిత దిశ పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం