Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి ఇష్టంలేక.. కాబోయే భర్త గొంతు కోసిన వధువు

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (15:07 IST)
అతనిని పెళ్లి చేసుకోవడం ఆ యువతికి ఇష్టంలేదు. ఈ విషయం తెలియని పెద్దలు వారిద్దరికీ నిశ్చితార్థం చేశారు. దీన్ని జీర్ణించుకోలేని యువతి ఏకంగా తనకు కాబోయే భర్తనే మట్టుబెట్టేందుకు నిర్ణయించుకుంది. ఇందుకోసం అతన్ని నమ్మించి సర్‌ప్రైజ్ ఇస్తానని చెప్పి తన వద్దకు పిలిపించుకుంది. ఆ తర్వాత కళ్లుమూసుకోవాలని చెప్పి మెడకు చున్నీ బిగించి తన వెంట తెచ్చుకున్న కత్తితో పీక కోసింది. ప్రస్తుతం ఆ యువకుడు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణం అనకాపల్లి జిల్లా మాడుగల మండలం ఎం.కోటపాడు గ్రామంలో జరిగింది. 
 
తాజగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఎం.కోటపాడు గ్రామానికి చెందిన అద్దెపల్లి రామునాయుడుకు, రావికమతానికి చెందిన వి.పుష్పకు ఈ నెల 4న వివాహ నిశ్చితార్థం జరిగింది. మే నెలలో వివాహం జరిపించేలా పెద్దలు ముహుర్తాలు పెట్టుకున్నారు. అయితే, ఈ పెళ్లి చేసుకోవడం పుష్పకు ఇష్టం లేదు. ఎలాగానే పెళ్లిని నిలిపుదల చేయాలని భావించింది. 
 
ఈ క్రమంలో సోమవారం రామునాయుడుకు పుష్ప ఫోన్‌ చేసి, ఇంటికి రావాలని కోరింది. ఇద్దరూ కలిసి బైక్‌పై బుచ్చెయ్యపేట మండలం అమరిపురి బాబా ఆశ్రమం వద్దకు వెళ్లారు. కాసేపు  మాట్లాడుకున్నాక తిరుగు ప్రయాణమయ్యారు.
 
మార్గమధ్యంలో బైక్‌  ఆపాల్సిందిగా పుష్ప కోరింది. కళ్లు మూసుకుంటే సర్‌ప్రైజ్‌ ఇస్తానని చెప్పింది. రామునాయుడు కళ్లు మూసుకోగా... చున్నీని అతడి మెడకు చుట్టి, వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసింది. 
 
ఆ తర్వాత రామునాయుడు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి, ప్రమాదం జరిగిందని, అతను గాయపడ్డాడని చెప్పింది. అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. కానీ, రామునాయుడు మాత్రం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పాడు. రామునాయుడు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించి, చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments