Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లంపల్లి ఆకాంక్ష హత్య కేసు : ఈశాన్య భారతంలో నిందితుడి అరెస్టు

Webdunia
బుధవారం, 5 జులై 2023 (10:09 IST)
తెలంగాణ రాష్ట్రంలోని బెల్లంపల్లికి చెందిన ఆకాంక్ష (23) అనే యువతిని హత్యచేసి, పారిపోయిన నిందితుడు అర్పిత్‌ అనే ఢిల్లీవాసిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో అరెస్టు చేసి సోమవారం రాత్రి నగరానికి తీసుకొచ్చి సిటీ కోర్టులో హాజరుపరిచారు. 
 
పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు.. మృతురాలు ఆకాంక్షకు, నిందితుడు అర్పిత్‌కు చాలా కాలంగా స్నేహం ఉందనీ, ఇద్దరూ ఇక్కడి ఓ సంస్థలో సహోద్యోగులుగా పని చేస్తూ వచ్చారని తెలిపారు. ఇక్కడే వారిద్దరూ సన్నిహితంగా మారారని, అర్పిత్‌కు హైదరాబాద్‌లో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లినా.. తరచుగా బెంగళూరు వచ్చి ఆకాంక్షతో స్నేహంగా మెలిగేవాడు. 
 
అదేసమయంలో వారి స్నేహం మధ్య గొడవలూ మొదలయ్యాయి. జూన్‌ 5న కోడిగేహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆకాంక్షతో అర్పిత్‌ గొడవపడి గొంతు నులిమి హత్య చేసి మృతదేహాన్ని ఫ్యాన్‌కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో మృతదేహాన్ని పరుపుపై పడేసి పారిపోయాడు. 
 
ఇంతకాలం తనతో సన్నిహితంగా మెలిగిన ఆకాంక్ష.. తాను హైదరాబాద్‌కు బదిలీ అయిన తర్వాత ఇతరులతో సన్నిహితంగా మాట్లాడటం సహించలేకే గొడవపడి కడేతేర్చినట్లు తేలింది. చాన్నాళ్లపాటు గాలించినా ప్రయోజనం లేకపోయింది. అతని వివరాలపై తాజా సమాచారం అందడంతో నగర పోలీసులు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లి నిందితుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments