Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాంలో కారులో కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం - మరో నిర్భయ ఘటన

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (15:14 IST)
ఈశాన్య భారత రాష్ట్రమైన త్రిపురలో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. కాలేజీకి వెళ్లి ఇంటికి వెళుతున్న 20 యేళ్ళ కాలేజీ విద్యార్థినిపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కారులో ఊరంతా తిప్పుతూ ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆ తర్వాత బాధితురాలిని ఓ నిర్జన ప్రదేశంలో పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్నట్టు భావిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. త్రిపురకు చెందిన ఓ యువతి సోమవారం కాలేజీ ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆ యువతిని ముగ్గురు నిందితులు బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్‌కు పాల్పడిన ప్రధాన నిందితుడు ఆ యువతికి ఐదు నెలలుగా తెలుసు. యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించిన తర్వాత ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు పట్టణంలో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ తర్వాత ఓ ప్రదేశంలో వదిలి వెళ్లారు. ఆమెను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించి, ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలు జీబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడైన కారు డ్రైవర్ గౌతమ్ శర్మ (26), సహ నిందితులు సుదీప్ ఛెత్రి (31), పెద్దజిత్ పాల్ (26)లుగా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరి నుంచి రూ.90 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments