Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెక్క పెట్టెలో శవం.. వీడని మర్డర్ మిస్టరీ!

ఠాగూర్
సోమవారం, 23 డిశెంబరు 2024 (16:18 IST)
వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఓ చెక్క పెట్టెలో మృతదేహం లభ్యమైంది. ఈ మర్డర్ మిస్టరీ కేసును పోలీసులు ఛేదించలేక తలలు బాదుకుంటున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన సాగి తులసి ఇంటికి.. గృహ నిర్మాణ సామగ్రి పార్సిల్ పేరిట వచ్చిన చెక్క పెట్టెలో శవం బయటపడింది. 
 
ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న తులసి మరిది (సోదరి భర్త) శ్రీధర్ వర్మ (అలియాస్ సురేంద్రవర్మ, సుధీర్ వర్మ) ఆచూకీని పోలీసులు ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు. ఈ ఘటన జరిగిన రోజు (గురువారం) భీమవరం నుంచి తాడేపల్లిగూడెం మార్గంలో సాగిపాడు వద్ద ఎరుపు రంగు కారులోంచి ముఖానికి మాస్క్ ధరించిన ఒక మహిళ దిగింది. అక్కడి నుంచే పిప్పరకు చెందిన ఆటోడ్రైవరుతో.. పెట్టెను యండగండి తీసుకెళ్లాలని కిరాయికి పురమాయించి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె ఎక్కిన కారు ఎటు వెళ్లిందనేది గుర్తించేందుకు ప్రధాన రహదారులపై ఉన్న సీసీ కెమెరాల పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
 
ఆ పెట్టె తులసి ఇంటికి చేరాక అందులో మృతదేహం ఉన్నట్లు గుర్తించగానే ఆమె మరిది శ్రీధర్ వర్మ పరారయ్యాడని, అతడు కూడా ఎరుపురంగు కారులోనే పరారైనట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మరోవైపు ఆ మహిళతో శ్రీధర్ వర్మకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలిసింది. పోస్టుమార్టం నివేదికను పరిశీలిస్తే.. అతడిని హత్య చేసినట్లుగా తేలిందని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వెల్లడించారు. 
 
కేసు పురోగతిపై ఐజీ అశోక్ కుమార్ భీమవరంలోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం సమీక్షించారు. మరోవైపు.. చెక్క పెట్టెలోని శవం ఎవరిదో గుర్తుపట్టడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సమీప ప్రాంతాల్లో 30-40 సంవత్సరాల మధ్య వయసున్న పురుషులు అదృశ్యమైతే తమకు తెలియజేయాలని ఉండి ఎస్ఐ నసీరుల్లా కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments