Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోకాళ్ళపై నిలబెట్టిందనీ 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (19:28 IST)
హైదరాబాద్ హయత్ నగరులో ఎనిమిదో తరగతి విద్యార్థిని ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్లాస్ టీచర్ మోకాళ్ళపై నిలబెట్టడంతో అవమానంగా భావించిన ఈ దారుణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హయత్ నగర్ ఆర్టీసీ కాలనీలో ఉన్న శాంతినికేతన్ స్కూలులో అక్షయ అనే విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది. గురువారం స్కూల్‌లో హోం వర్క్ చేయలేదని టీచర్ మందలిచింది. అదేసమయంలో ఆ విద్యార్థిని తరగతి గదిలో అల్లరి చేయడాన్ని గమనించి మోకాళ్లపై నిలబెట్టింది. దీంతో సాటి విద్యార్థుల ముందు అవమానం జరిగిందని భావించి తీవ్ర మనస్తాపానికి లోనైంది. 
 
సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తమ బిడ్డ విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మాయనికా ఆస్పత్రి తరలించారు. 
 
టీచర్ మందలించడం వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. విద్యార్థిని బలవన్మరణానికి స్కూలు యాజమాన్యం నైతిక బాధ్యతవహించాలని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments