Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికిత్స కోసం ఆస్పత్రికెళ్లిన నెల్లూరు టెక్కీ ఆత్మహత్య... ఎక్కడ?

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (10:08 IST)
హైదరాబాద్ నగరంలో మరో విషాదకర ఘటన జరిగింది. టెక్కీ ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స కోసం ఆస్పత్రికెళ్లిన ఆమె.. అక్కడ ప్రాణాలు తీసుకోవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగింది.
 
రాజేంద్రనగర్‌ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కేంద్రానికి చెందిన సుదీప్తి (27) హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తుంది. ఆమె బండ్లగూడజాగీర్‌లోని అపార్ట్‌మెంట్లో ఉంటూ విధులకు హాజరవుతోంది. 
 
ఈ క్రమంలో ఈ నెల 6న అనారోగ్యంతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. మూడు రోజులుగా ఆమె చికిత్స తీసుకుంటూ పూర్తిగా కోలుకుంది. మంగళవారం మధ్యాహ్నం డిశ్ఛార్జ్‌ చేస్తామని వైద్యులు తెలిపారు. 
 
ఈ క్రమంలో ఉదయం 9 గంటల సమయంలో ఆమెను పరిశీలించేందుకు నర్సు ఆమె గది దగ్గరకు వెళ్లింది. ఈ సమయంలో లోపలి తలుపు గడి పెట్టుకొని ఉండటంతో ఆమె ఆసుపత్రి సిబ్బందికి సమాచారమిచ్చింది. 
 
అనంతరం సిబ్బంది తలుపు బద్దలు కొట్టి లోపలికెళ్లి చూడగా.. సుదీప్తి ఫ్యానుకు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆసుపత్రి నిర్వాహకులు రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. యువతి ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడిందో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments