Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్కె తీర్చుకున్నాడు.. కాదు పొమ్మన్నాడు... ఎందుకు?

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (11:54 IST)
పలువురు కామాంధులు అమ్మాయిల బలహీనతలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ కోవలో ప్రేమ పేరుతో ఓ అమ్మాయిని లొంగ దీసుకుని శారీరక సుఖం అనుభవించాడు. తీరా పెళ్లి చేసుకోమని కోరడంతో కాదు పొమ్మన్నాడు. బాధితురాలు ఓ వివాహిత కావడం గమనార్హం. తన భర్తకు విడాకులు ఇచ్చి, దేశాలు దాటి మరీ వచ్చింది. తీరా కోరిక తీరాక ఆ యువతిని వదిలి మరొకరితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
హైదరాబాద్ బోరబండ రాజ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి (27) టెలీకాలర్‌గా పని చేస్తుంది. ఈ యువతికి ఐదేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో మహారాష్ట్ర జల్‌గావ్‍‌కు చెందిన సైఫ్ (28) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడి, ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలో వారిద్దరూ హైదరాబాద్ నగరంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేశారు.
 
అయితే, యువతి తరపు కుటుంబ సభ్యులు వారి పెళ్లికి నిరాకరించారు. దీంతో 2020లో ఆమెకు మరో వ్యక్తితో వివాహం చేసి దుబాయ్‌కు పంపించారు. ఆ యువతి భర్తతో కలిసి దుబాయ్‌కు వెళ్ళినప్పటికీ తన ప్రియుడు సైఫ్‌తో మాత్రం కాంటాక్ట్‌లోనే ఉంది. వారిద్దరూ చాటింగ్‌లు చేసుకోవడం, ఫోన్లు చేసుకోవడం చేయసాగారు. ఈ నేపథ్యంలో కట్టుకున్న భర్తకు విడాకులిచ్చి స్వదేశానికి వస్తే పెళ్లి చేసుకుంటానని సైఫ్ నమ్మించాడు. 
 
అతని మాటలు నమ్మిన ఆమె భర్తకు విడాకులిచ్చి స్వదేశానికి వచ్చింది. ఈ క్రమంలో మొదటి భర్త ద్వారా అయిన గర్భంకూడా సైఫ్ తొలగించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఉండసాగారు. అలా రోజులు గడిచిపోతున్నాయే గానీ.. పెళ్లికి మాత్రం సైఫ్ ససేమిరా అంటున్నారు. పైగా, స్వగ్రామంలో మరో అమ్మాయితో ఈ నెల 22వ తేదీన పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments