Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ అమ్మాయిని ప్రేమించా, నాకిచ్చేయండి: నీకింకా పెళ్లీడు రాలేదన్న బాలిక తండ్రిని పొడిచిన బాలుడు

ఐవీఆర్
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (19:58 IST)
మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి అని ఓ 16 ఏళ్ల బాలుడు ఏకంగా బాలిక తండ్రిని అడిగాడు. ఇప్పుడే తొందర ఎందుకు... మీ ఇద్దరికీ పెళ్లీడు వచ్చాక చూద్దాములే అని బాలిక తండ్రి చెప్పాడు. ఇలా చెప్పిన ఆయన తనకు పిల్లనివ్వడని నిర్ణయించుుకున్న ఆ బాలుడు బాలిక తండ్రిపై హత్యా యత్నం చేసాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తెలంగాణ లోని నిర్మల్ లో 16 ఏళ్ల బాలుడు మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక పట్ల ప్రేమను పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆమె వెంటబడుతూ తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు.
 
అందుకామె నిరాకరించింది. దీనితో అతడు నేరుగా బాలిక తండ్రి వద్ద పంచాయతీ పెట్టాడు. మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాననీ, నాకిచ్చి పెళ్లి చేయాలంటూ అభ్యర్థించాడు. ఆ బాలుడు మాటలు విన్న బాలిక తండ్రి... ఇప్పుడే పెళ్లికి ఏం తొందర. మీ ఇద్దరికీ పెళ్లీడు రాలేదు. వచ్చాక చూద్దాంలో పో అని పంపించేసాడు. బాలిక తండ్రి మాటలతో అసంతృప్తి చెందిన బాలుడు బాలిక తండ్రిని హత్య చేసి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసాడు.
 
తన స్నేహితుడైన మరో యువకుడితో కలిసి శనివారం అర్థరాత్రి బాలిక ఇంట్లో చొరబడి ఆమె తండ్రిపై కత్తెరతో దాడి చేసి పొడిచి పారిపోయారు. ఆర్తనాదాలు విన్న ఇరుగుపొరుగువారు బాలిక తండ్రిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా వుండటంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments