Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కనే పిల్లలున్నారని కూడా చూడకుండా ప్రియుడి కోసం భర్తను అలా చేసింది

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (19:12 IST)
వివాహేతర సంబంధం నిండు జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన సంచలనంగా మారింది. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామం. రామయ్య- జయలక్ష్మి ఇద్దరు భార్యాభర్తలు. పెళ్లయి కూతురు, కుమారుడు కూడా ఉన్నారు. పిల్లాపాపలతో వారి జీవితం సుఖంగా సాగుతోంది.
 
కొన్నాళ్ల పాటు సంతోషంగా గడిపిన వీరి కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. అయితే రామయ్య భార్య జయలక్ష్మి రెండేళ్ల నుంచి అదే గ్రామానికి చెందిన మహ్మద్ కైజర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తకు తెలియకుండా బయటి సుఖానికి అలవాటు పడింది. అలా సమయం దొరికినప్పుడల్లా కైజర్‌తో ఆ మహిళ గడుపుతోంది.
 
కొన్నాళ్లకు ఈ విషయం కాస్తా భర్త రామయ్యకు తెలిసింది. భార్యను మందలించే ప్రయత్నం చేశాడు. దీంతో బుద్ది మార్చుకోని జయలక్ష్మి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపాలని భావించింది. నిద్రిస్తున్న భర్త గొంతుకి టవల్ బిగించి హత్య చేసింది.
 
ఈ ఘోరాన్ని కూతురు, కుమారుడు కళ్లారా చూసి బంధువులకు తెలిపారు. ఇక హత్య అనంతరం ప్రియుడి సాయంతో భర్త శవాన్ని హంద్రీనీవా కాలువలో పడేసింది. ఇంతటితో ఆగకుండా భర్త కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ప్లాన్ వేసిన ప్రియుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments