కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

ఠాగూర్
సోమవారం, 1 డిశెంబరు 2025 (12:29 IST)
మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఓ పరువు హత్య జరిగింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. తమ కూతురిని ప్రేమిస్తున్నాడన్న కారణంతో ఓ యువకుడిని యువతి కుటుంబ సభ్యులే అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ప్రియుడి అంత్యక్రియల వద్దకు చేరుకున్న ఆ యువతి, అతని మృతదేహాన్ని పెళ్లాడి, ఇకపై అతని కుటుంబంతోనే కోడలిగా ఉంటానని శపథం చేయడం అందరినీ కదిలించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాందేడ్‌కు చెందిన సాక్షం టేటే (20), అచల్ మమిల్వర్ అనే యువతి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తన సోదరుల ద్వారా పరిచయమైన సాక్షంతో అచల్ మమిల్వర్‌కు సాన్నిహిత్యం పెరిగింది. అయితే వేర్వేరు కులాలు కావడంతో అచల్ మమిల్వర్ కుటుంబ సభ్యులు వారి పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. సంబంధం మానుకోవాలని అనేకసార్లు బెదిరించారు. అయినప్పటికీ వారు తమ ప్రేమను వదులుకోలేదు.
 
సాక్షం టేట్టే‌ను పెళ్లి చేసుకోవాలని అచల్ మమిల్వర్ నిర్ణయించుకున్న విషయం తెలియడంతో ఆమె తండ్రి, సోదరులు గురువారం అతనిపై దాడి చేశారు. సాక్షంను తీవ్రంగా కొట్టి, తలపై తుపాకీతో కాల్చి, అనంతరం బండరాయితో తల నుజ్జునుజ్జు చేసి కిరాతకంగా హత్య చేశారు.
 
సాక్షం అంత్యక్రియలు జరుగుతుండగా అచల్ మమిల్వర్ అక్కడికి చేరుకుంది. అతని మృతదేహానికి పసుపు రాసి, తన నుదుట సిందూరం దిద్దుకుంది. చనిపోయినా తన ప్రియుడినే భర్తగా స్వీకరించింది. జీవితాంతం సాక్షం టేటే ఇంట్లోనే అతని భార్యగా, వారి కోడలిగా ఉండిపోతానని నిర్ణయించుకుంది. 
 
'సాక్షం మరణంలో కూడా మా ప్రేమే గెలిచింది. మా నాన్న, సోదరులు ఓడిపోయారు. సాక్షం చనిపోయినా మా ప్రేమ బతికే ఉంది' అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, హత్యకు పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments