Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడు మనిషేనా..? ప్రియురాలిపై దాడి.. అపస్మారక స్థితిలో..ఎక్కడ?

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (10:05 IST)
మహిళలపై అకృత్యాలు పెరుగుతూనే వున్నాయి. అత్యాచారాలు, అకృత్యాల ఆగడాలు ఆగట్లేదు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. మధ్యప్రదేశ్‌లో ప్రియురాలిపై విచక్షణారహితంగా దాడి చేసి రోడ్డుపై అపస్మారక స్థితిలోకి వదిలి వెళ్లిన ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఓ యువకుడు, అతని ప్రియురాలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన యువకుడు ఒక్కసారిగా ప్రియురాలిని కొట్టడం ప్రారంభించాడు. ఆమెను కిందకు తోసి ఆమె ముఖంపై ఆవేశంగా కాలితో తొక్కాడు. దీంతో  ఆ మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆ యువకుడు  ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. 
 
ఇది చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియురాలిపై దాడికి పాల్పడిన యువకుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం యువకుడు యువతిపై దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వీడియో రూపంలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments