Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టపగలు.. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కన్నతండ్రిని పొడిచి చంపేసిన కొడుకు...

ఠాగూర్
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (18:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా పరిధిలో పట్టపగలు ఓ దారుణం చోటుచేసుకుంది. నడి రోడ్డుపై పట్టపగలు అందరూ చూస్తుండగా తండ్రిని కన్నకొడుకు కత్తితో పొడిచి చంపేశాడు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... 
 
సికింద్రాబాద్ద లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి (45) అనే వ్యక్తికి కుమారుడు సాయి కుమార్ (25) ఉండగా, వీరిద్దరూ కలిసి ప్యాకర్స్ అండ్ మూవర్స్‌లో పని చేస్తున్నారు. మొగిలి నిత్యం మద్యం సేవించి ఇంట్లో గొడవ చేస్తుండటంతో సాయి కుమార్ విసిగిపోయాడు. 
 
శనివారం మధ్యాహ్నం లాలాపేట నుంచి మొగిలి బస్సులో బయలుదేరగా, అతని కుమారుడు బైకుపై అనుసరించాడు. ఈసీఐఎల్ బస్ టర్మినల్ వద్ద బస్సు దిగిన తండ్రిని తన వెంట తెచ్చుకున్న చాకుతో విచక్షణా రహితంగా 10, 15 సార్లు పొడిచాడు. 
 
దీంతో తీవ్రంగా గాయపడిన మొగిలిని స్థానికంగా ఉండే ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తండ్రిపై కుమారుడు కత్తితో దాడి చేస్తున్న దృశ్యాసలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు సాయి కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments