Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

ఠాగూర్
సోమవారం, 31 మార్చి 2025 (15:24 IST)
దైవదర్శనానికి వచ్చిన ఓ యువతిపై కొందరు కామాంధులు సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగింది. సామూహిక అత్యాచారం చేస్తున్న సమయంలో బాధితురాలు గొంతు తడారిపోయి దాహం దాహం అంటూ కేకలు వేయడంతో కామాంధులు కనికరించకపోగా ఆమె నోట్లో మూత్రం పోసినట్లు తేలింది. ఈ దారుణ ఘటనకు పాల్పడ్డవారిలో ఆరుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో వున్నారు.
 
ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి బంధువులతో కలిసి శనివారం సాయంత్రం వచ్చి దైవదర్శనం చేసుకున్నారు. ఆ రాత్రికి అక్కడే నిద్రించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆ యువతి ఒంటరిగా కాలకృత్యాల కోసం సమీప గుట్ట ప్రాంతానికి వెళ్లగా అక్కడ మాటువేసివున్న కొందరు యువకులు ఆమెను అటకాయించారు. 
 
ఆ తర్వాత ఆమె వెంట వచ్చిన బంధువుపై దాడి చేసి చేతులు కట్టేసి, ఆ యువతిని మాత్రం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఊర్కొండపేట గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులను నిందితులుగా గుర్తించారు. వీరిలో ఆరుగురిని అదుపులోకి తీసుకోగా, మిగిలినవారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments