Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారక్‌తో చంద్రబాబు భారీ ప్లాన్..? ఏంటది?

Webdunia
బుధవారం, 12 మే 2021 (13:09 IST)
తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని ఆ పార్టీ సీనియర్ నేతలే విశ్వాసంగా చెబుతున్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. పార్టీ పని అయిపోయిందని చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆయన ఒక్కరే కాదు మిగతా టీడీపీ నేతలందరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. మున్సిపల్, కార్పొరేషన్, తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పొందగా.. టీడీపీ పని అయిపోయిందని.. టీడీపీని బలపరిచేందుకు ఒక బలమైన నాయకుడు అరంగేట్రం చేయాలని అంతర్గత సమావేశాల్లో తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.
 
అయితే వారి సమావేశాల్లో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు వస్తోంది. మునుపటి వైభవం రావాలన్నా.. గెలుపు గుర్రం ఎక్కాలన్నా.. తారక్ ఒక్కరే తెలుగుదేశం పార్టీకి దిక్కు అనే నిర్ణయానికి తెలుగు తమ్ములు అందరూ వచ్చారని తెలుస్తోంది. నారా లోకేష్ రాజకీయ అసమర్థుడని.. ఆయన కారణంగా పార్టీ భ్రష్టు పట్టడం తప్ప ఒరిగేదేమీ లేదని అనేక చర్చలు సొంత పార్టీలోనే జోరుగా సాగుతున్నాయి. వారి చర్చలు చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తారక్ వస్తేనే.. టీడీపీ పుంజుకుంటుందని కొందరు నేరుగా చంద్రబాబు వద్దే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో చివరికి చంద్రబాబు కూడా జూనియర్ ఎన్టీఆర్ సహాయంతో తెలుగుదేశం పార్టీని బలపరచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
 
ఈ క్రమంలోనే రాజకీయ ప్రయోజనాల కొరకే చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు జూ.ఎన్టీఆర్ పైన వల్లమాలిన ప్రేమ కురిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన విషయం తెలిసిందే. "తారక్ కరోనా నుంచి సత్వరమే కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. జాగ్రత్తగా ఉంటూ త్వరగా కోలుకో" అని చంద్రబాబు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్ వెనుక పెద్ద పొలిటికల్ ప్లాన్ ఉందని పలువురు అంటున్నారు.

రాజకీయాల్లో గెలవడానికి చంద్రబాబు ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. ఐతే తారక్‌ని పార్టీలో ఉంచితే తన తనయుడు లోకేష్ బాబుకి ప్రాధాన్యత తగ్గుతుందని చంద్రబాబు భావిస్తూ వస్తున్నారు. కానీ ప్రస్తుత నేపథ్యంలో పార్టీ నామరూపాలు లేకుండా భూస్థాపితమయ్యే సూచనలు విస్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇక చేసేదేమీలేక టీడీపీ మనుగడ కొరకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును పక్కనపెట్టి తారక్‌ని రంగంలోకి దింపేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments