Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీపై మాటలు తూటాలు పేలుస్తున్న పవన్ కళ్యాణ్... చిరంజీవికి కష్టాలు తప్పవా?

ఎందుకో కానీ రూమర్లు అలా తిరుగుతుంటాయి. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, అక్కడ రాజకీయ నాయకులపై జరుగుతున్న ఐటీ, సీబీఐ దాడుల నేపధ్యంలో అంతా కేంద్రంలో పగ్గాలు చేపట్టిన భాజపాను చూపిస్తున్నారు. భాజపా తమకు ఎదురుతిరుగుతున్న పార్టీలను లేవకుండ

Webdunia
శనివారం, 20 మే 2017 (14:08 IST)
ఎందుకో కానీ రూమర్లు అలా తిరుగుతుంటాయి. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, అక్కడ రాజకీయ నాయకులపై జరుగుతున్న ఐటీ, సీబీఐ దాడుల నేపధ్యంలో అంతా కేంద్రంలో పగ్గాలు చేపట్టిన భాజపాను చూపిస్తున్నారు. భాజపా తమకు ఎదురుతిరుగుతున్న పార్టీలను లేవకుండా చేసేందుకు ఇలాంటి దాడులు చేయిస్తున్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. 
 
ఇటీవలే తమిళనాడులో కేంద్ర మాజీమంత్రి పి. చిదంబరం పైన జరిగిన సీబీఐ దాడులు తమపై కక్ష సాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవకాశం చిక్కినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, భాజపాను జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. ఉత్తరాది అహంకారం అంటూ పెద్దపెద్ద మాటలు ప్రయోగిస్తున్నారు. ఈ మాటలను ఎవరిని అంటున్నారో వేరే చెప్పక్కర్లేదు. 
 
కానీ ప్రధానమంత్రి మోదీ మాత్రం పవన్ వ్యాఖ్యలను అంతగా పట్టించుకున్నట్లు కనబడటం లేదు. మిత్రుడు కదా... ఏదో అలా మాట్లాడుతున్నారు, స్నేహితుల మధ్య అప్పుడప్పుడు మనస్పర్థలు తప్పవని మిన్నకుంటున్నారేమోనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఐతే తమిళనాడులో జరుగుతున్నవి చూసినప్పుడు ఏదో ఒకరోజు... పవన్ కళ్యాణ్ కు కూడా అలాంటి పరిస్థితి వస్తుందని అంటున్నారు. ఐతే పవన్ కళ్యాణ్ తనకంటూ పోగేసుకున్న ఆస్తి ఏదీ లేకపోవడంతో ఆయనపైకి వెళ్లినా లాభం లేదని అనుకుంటున్నారట. 
 
కనుక పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టాలంటే ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి ఆస్తులు గురించి ఆరా తీసి వ్యవహారాన్నంతా లోతుగా చూస్తే సరిపోతుందని అనుకుంటున్నారట. ఇదే నిజమైతే... పవన్ కళ్యాణ్‌ను డైరెక్టుకు ఏమీ చేయలేక మెగాస్టార్ చిరంజీవిని ఆయుధంగా వాడుకోవాలని వారు చూస్తున్నారని అంటున్నారు. 
 
రాబోయే ఎన్నికల సమయానికి తమ మాట వింటే సరే... లేదంటే ఆయుధాలను వాడుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐతే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తను వేటికీ భయపడననీ మొండిగా చెప్పేశారు. కాబట్టి పవన్ అన్నిటికీ తెగించి సిద్ధంగా వున్నారు కనుక ఎవ్వరికీ భయపడరని అంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments