Webdunia - Bharat's app for daily news and videos

Install App

Petrol లీటరు రూ. 100, గ్యాస్ బండ ఒకటి రూ. 1000, గ్యాస్ బండతో మోదుతున్న మోదీ సర్కార్

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (15:25 IST)
చూస్తుంటే మోదీ ప్రభుత్వం పెట్రోలు, గ్యాస్ బండ రేట్లపై ఏమైనా టార్గెట్ పెట్టుకుందా? రౌండ్ ఫిగర్ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందా? పెట్రోలు ధర ప్రస్తుతం రూ. 93కి చేరిది. గ్యాస్ సిలిండర్ ధర రూ. 800 చేరుకుంది. చూస్తుంటే ఈ రెండూ వరుసగా రూ. 100, రూ. 1000కి చేరుకునే రోజు ఎంతోదూరంలో లేదనిపిస్తోంది.

ఏడాదిన్నర క్రితం వరకూ గ్యాస్ బండపై సబ్సిడీ దాదాపు 250 రూపాయలకి పైగానే వచ్చేది. కానీ ఇప్పుడు ఆ మొత్తం చూస్తే షాక్ తిన్నంత పనవుతోంది. అది కేవలం రూ. 25 లేదంటే 15 రూపాయలు కూడా వుంటుందంటే గ్యాస్ బండతో మోదీ సర్కార్ ఎలా మోదుతుందో అర్థం చేసుకోవచ్చంటున్నారు జనం.
 
సబ్సిడీ ఇస్తాం నమోదు చేసుకోండి, మీ ఖాతాకి నేరుగా డబ్బు జమ అయిపోతుందనగానే అందరూ గ్యాస్ బండ ఖాతాతో ఆధార్ లింకింగ్ చేసి బ్యాంకు ఖాతాకు పెట్టుకున్నారు. ఏడాదిన్నర క్రితం వరకూ గ్యాస్ బండ సబ్సిడీ కింద 250 పైగానే వచ్చింది. అంటే.. గ్యాస్ సిలిండర్ రూ. 750 అనుకుంటే అందులో 250 తిరిగి చేతికి వచ్చేది. కానీ ఇప్పుడలా లేదు. రూ. 750 చెల్లిస్తే అందులో సబ్సిడీ కింద పాతిక రూపాయలకి మించి రావడంలేదు. దీన్నిబట్టి నూటికి 95 శాతం గ్యాస్ సిలిండర్ డబ్బులు వినియోగదారులు కట్టేస్తున్నట్లే.
 
మరోవైపు చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరుకు 30 పైసలు పెంచడంతో హైదరాబాద్‌లో పెట్రోల్ ధరలు ఆదివారం ర్యాలీని కొనసాగించాయి. ఈ రేటు వరుసగా ఆరో రోజు పెరిగింది. హైదరాబాదులో లీటరుకు పెట్రోల్ ధర రూ. 91.96 నుండి రూ. 92.26కి చేరింది. ఇదే కాలంలో లీటరుకు డీజిల్ ధర రూ. 85.89 నుండి రూ. 86.23 చేరుకుంది. ఇదేక్రమంలో హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రాబోయే కొద్ది వారాల్లో 100 మార్కుకి చేరుకుంటుందని అంటున్నారు.
 
నిపుణుల అభిప్రాయం
రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చమురు కంపెనీల అధికారులు తెలిపారు. ఏదేమైనా, కొత్త కరోనావైరస్ జాతిపై ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో తాజా లాక్డౌన్ త్వరలో ధరలను తగ్గించవచ్చని నిపుణులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments